కేసిఆర్ నాయకత్వంలో*దేశానికే దిక్సూచిగా తెలంగాణ

రాజన్న సిరిసిల్ల బ్యూరో. సెప్టెంబర్ 17.(జనం సాక్షి). ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా మారిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించినజాతీయ సమైక్యత వేడుకలకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీస్ ల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.ప్రభుత్వ అధ్వర్యంలో జాతీయ సమైక్యత వేడుకలకు ఎందుకు నిర్వహిస్తున్నామో, భారత్ అంశాల పై మాట్లాడారు. 9 ఎండ్లలోసిఎం కేసిఆర్ నాయకత్వంలో దేశానికే దిక్సూచిగా తెలంగాణను నిలిపామని చెప్పారు. మంత్రి కేటీఆర్ మార్గదర్శనంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని రంగాలలో గణనీయ అభివృద్ధి సాధించిందన్నారు. అన్ని ఆలోచించే హైదరాబాద్ సంస్థానం విలీనం నుజాతీయ సమైక్యత దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు. ఇప్పుడున్న భారతదేశం ఇంతకుముందు బ్రిటీష్ ఇండియా, నాన్ బ్రిటీష్ ఇండియా కు ఉండేదని అన్నారు. నాన్ బ్రిటీష్ ఇండియాలో హైదరాబాద్ సంస్థానం కూడా భాగమన్నారు.రాచరిక పాలన నుండి విముక్తి పొందిన ప్రజాస్వామ్య పాలన ఆవిర్భవించిన 17, సెప్టెంబర్ 1948 నీ భిన్న ఆలోచన విధానం తో కొందరూ విమోచన, విలీన, విద్రోహ దినంగా పిలుచుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. తాము మాత్రం అన్ని ఆలోచించే తెలంగాణ భారత దేశంలో భాగం కాబడిన సందర్భాన్ని పురస్కరించుకొని జాతీయ సమైక్యత దినంగా ప్రకటించి వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

భారత్ మాత్రమే పేరుగా ఉండాలని అనుకోవడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పారు.
మన దేశంలో ఇండియా, భారత్ అని పిలుచుకుంటుండగా ఈ రెండింటికి భిన్నంగా పాకిస్తాన్ ,ఆఫ్ఘనిస్తాన్, గల్ఫ్ దేశాల్లో భారతదేశాన్ని హిందుస్తాన్ గా ప్రాచుర్యంలో ఉందన్నారు. అనవసర వివాదాలతో దేశంలో వైషమ్యాలు సృష్టించి రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని హితవు పలికారు. భిన్న వైరుధ్యాలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, భాషలు, భౌగోళిక పరిస్థితులకు నెలవైన భారత దేశంలో ఒకేదేశం- ఒకే ఎన్నిక, ఒకే దేశం – ఒకే భాష , అధ్యక్ష తరహా పాలన ఆలోచనలు సరికాదన్నారు. జాతీయ సమైక్యత వేడుకలలో
జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా, రాష్ట్ర పవర్ లూం, టెక్స్ టైల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్, టేస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ లు జిందం కళా చక్రపాణి, జిల్లా అదనపు కలెక్టర్ లు ఎన్ ఖీమ్యా నాయక్, గౌతమ్ రెడ్డి , అదనపు ఎస్పీ చంద్రయ్య ,ఆర్డీఓ లు ఆనంద్ కుమార్, మధు సూదన్, ప్రత్యేక ఉప కలెక్టర్ బి గంగయ్య, dsp లు ఉదయ్ రెడ్డి, నాగేంద్ర చారి,
జిల్లా అధికారులు, ఎంపీపీ జడ్పిటిసిలు పాల్గొన్నారు.