సమైక్య భారతాభివృద్ధిలో తెలంగాణ కీలకపాత్ర
యైటింక్లయిన్ కాలని సెప్టెంబరు 17 (జనంసాక్షి): ఒకప్పుడు సంస్థానంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం స్వతంత్ర భారత దేశంలో విలీనమై నేడు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి, సమైక్య భారతాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని, సింగరేణి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్డ్ మూమెంట్ డాక్టర్ జే.ఆల్విన్ పేర్కొన్నారు.
సింగరేణి భవన్లో ఆయన ఆదివారం జరిగిన తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి, సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ ఎం సురేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎం .సురేష్ మాట్లాడుతూ భారతదేశ ప్రగతిలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం ఐటి తదితర రంగాల్లో తన వంతు సహకారం అందిస్తు జాతీయ స్థాయిలో నెంబర్ వన్ గా ఉంటోందన్నారు. అలాగే సింగరేణి సంస్థ తగినంత బొగ్గు ఉత్పత్తి మరియు థర్మల్ విద్యుత్ ద్వారా రాష్ట్ర ప్రగతికి సహకారం అందిస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్ భాస్కర్, డీజీఎంలు ప్రదీప్ కుమార్, విజయేందర్ రెడ్డి, తాడబోయిన శ్రీనివాస్ , సింగరేణి భవన్ అధికారులు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తాజావార్తలు
- శాంతి చర్చల కోసం సిద్ధం : మావోయిస్ట్ పార్టీ లేఖ
- కడవెండిలో విషాదఛాయలు.. బరువెక్కిన హృదయాలు
- మీడియా అండ్ కమ్యూనికేషన్స్ అడ్వైజర్గా అల్లం నారాయణ
- అడవిలో మరోసారి అలజడి
- రష్యా దాడులు ఆపడం లేదు
- పాడిపరిశ్రమ పెద్దపీట
- వైద్యుల పర్యవేక్షణలోనే సునీతా విలియమ్స్
- ఫోన్ ట్యాపింగ్ కేసులో రెడ్కార్నర్ నోటీసులు
- సునీతా విలియమ్స్ సేఫ్గా ల్యాండ్
- 15 మందికి అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతి
- మరిన్ని వార్తలు