వియోచన దినోత్సవం రోజు సర్దార్ ను మార్చిన నేతలు.
తాండూరు సెప్టెంబర్ 17 (జనంసాక్షి ) తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకొని ముఖ్యమంత్రి ఆదేశానుసారం ఆదివారం యోచన దినోత్సవాన్ని తాండూరు పట్టణం మార్కెట్ కమిటీ ఆవరణలో జరుపుకున్నారు. అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాన్ని మర్చిపోయి వియోచన దినోత్సవాన్ని జరుపుకున్నారు. వియోచన దినోత్సవం రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటం లేకపోవడం పట్ల పలు విమర్శలు ఎత్తిపోస్తున్నారు.రాజా కారుల వ్యవస్థపై పోరాడిన పటేల్ ను తెలంగాణ విమోచన దినోత్సవం రోజున ప్రజా ప్రతినిధులు మర్చిపోవడం ఆయన ఫోటోను పెట్టకపోవడం పై విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. తాండూర్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం పదవి చేపట్టబోతున్న సమయంలో మహనీయుల ఫోటోలు మర్చిపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.