యువత స్వయం ఉపాధిని ఎంచుకోవడం అభినందనీయం.
తాండూరు సెప్టెంబర్ 18(జనంసాక్షి) నేటి యువత స్వయం ఉపాధిని ఎంచుకోవడం అభినందనీయమని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నాడు. ఆదివారం తాండూర్ పట్టణం వీరశైవ కాంప్లెక్స్ లో నేచురల్ పాన్ షాప్ ను నిర్వాహకులు దూరశెట్టి సతీష్ కుమార్
నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హాజరై నేచురల్ పాన్ షాప్ ను ప్రారంభించారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత తన కాళ్ళపై తాను నిలబడుతూ ఉపాధి ఎంచుకోవడం ఎంతో అభినందనీయమని తెలిపారు. పాన్ షాప్ ను ప్రారంభించడానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని పూలబుఖ్యతో ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ చారి యువ నాయకుడు ఇంతియాజ్ బాబా, పాన్ షాప్ యజమాన్యం,కుటుంబ సభ్యులు, తోటి మిత్రులు నాగరాజ్ ,విజయ్,గోవింద్ ,తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం అమెరికా `భారత్లు కలిసి పనిచేస్తూనే ఉంటాయి
- సిట్ ఎదుట వెంటనే లొంగిపోండి
- గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికలు వేములవాడ నియోజకవర్గంలో ప్రశాంతంగా ప్రారంభం
- లింగంపల్లిలో కాంగ్రెస్ నేతల దాడిలో బిఆర్ఎస్ సీనియర్ కార్యకర్త మృతి
- పట్టణ సమస్యలు పరిష్కరించండి
- కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం
- కోనాపురం కాంగ్రెస్ అభ్యర్థికి రూ.50 వేల విరాళం అందజేత…
- భారత్ ఊహల్లో తేలొద్దు
- బియ్యంపై బాదుడు!
- వ్యవస్థలను మెరుగుపర్చేందుకే నిబంధనలు
- మరిన్ని వార్తలు


