ఘనంగా ముప్పిడి మధుకర్ జన్మదిన వేడుకలు

సికింద్రాబాద్ ఆర్ సి జనం సాక్షి సెప్టెంబర్ బోయినపల్లిలోని బిఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్ అసెంబ్లీ,మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి కార్యాలయంలో సీనియర్ నేతబిఆర్ఎస్ నాయకులు ముప్పిడి మధుకర్ జన్మదిన వేడుకలకు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముప్పిడి మధుకర్ చే మర్రి రాజశేఖర్ రెడ్డి,పార్టీ నాయకులు అభిమానుల మధ్య కేక్ కటింగ్ చేయించి, కేక్ ను మధుకర్ కు తినిపించి మర్రి రాజశేఖర్ రెడ్డి, ఇతర నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి,పాండుయాదవ్,నలిని, శ్యామ్,ప్రభు గుప్తా,సురేష్,అమీర్,అరుణ్ యాదవ్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.