తహసీల్దార్ కు నిలయాపల్లి ఆదివాసుల విన్నపం
మాకు ప్రభుత్వం ఇచ్చిన 669/12/1 సీలింగ్ భూమిలో నెన్నెల మండలానికి చిందిన ఓ ఎంపిటిసి అక్రమంగా రైస్ మిల్లు కట్టడానికి నిలిపి వెయ్యాలని తహసీల్దార్ గారికి విజ్ఞప్తి చెయ్యడం జరిగింది. మా అందరికి భూమి హద్ఫులు నిర్ణయించి, డిమార్కెషన్ చేసి ఇరువురికి సమాన న్యాయం చెయ్యాలని, గతంలో జిల్లా కలెక్టర్ కు విన్నవించడం జరిగింది.
నేడు తాండూర్ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
తహసీల్దార్ వెంటనే స్పందించి, ఎస్సి,ఎస్టీ లను జరిగిన అన్యాయం పైన పూర్తిగా విచారణ జరిపి మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి.. మా భూమిపైన జరిగే ఇల్లీగల్ కంట్రీక్షన్ ఆపాలని,ఆర్ఐ,ఎంసి లను సైట్ పైన పంపించడం జరిగింది…
మాకు త్వరలో పూర్తిస్థాయిలో న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాము..మడే పెంటయ్య.మడే గౌరు.మడే చిన్నక్క.దాసరి లక్షి.
దాసరి శ్రీనివాస్.
నిలయాపల్లి గ్రామం.
తాండూర్ మండలం.
మంచిర్యాల జిల్లా