సింగరేణి ముద్దు బిడ్డగా చెన్నూరు గడ్డ పై ఎన్నికల బరిలో

నా ప్రాంత ప్రజల కష్టాలను చూసి వైద్య వృత్తి నుండి రాజకీయాల్లోకి

రజాకార్ నాయకుని పాలన విముక్తికై నా పోరాటం.. చెన్నూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రాజా రమేష్

చెన్నూరు గడ్డ పై కాంగ్రెస్ పార్టీ తరుపున ఎన్నికల బరిలో ఉండేందుకు సింగరేణి ప్రాంత ముద్దు బిడ్డగా మీ ముందుకు రావడం జరిగింది అని చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రాజా రమేష్ బాబు అన్నారు. సోమవారం మందమర్రి పట్టణం లోని శ్రీపతి నగర్ లో ఇంటింటికీ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజా రమేష్ బాబు మాట్లాడుతూ వైద్య చదువులు పూర్తి చేసిన అనంతరం డాక్టర్ గా జీవితాన్ని ప్రారంభించడానికి ముందుకు వెళ్తున్న క్రమంలో నా తల్లిదండ్రులు ఎక్కడో కాదు మేము పని చేసిన సింగరేణి సంస్థ లో ఉద్యోగం సాధించి ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించడం తో వారి అభిప్రాయాన్ని గౌరవించి సింగరేణి లో వైద్యునిగా సేవలు అందించడం జరిగిందన్నారు. వైద్య వృత్తిలో కొనసాగుతున్న క్రమంలో సింగరేణి ప్రాంత ప్రజలు స్థానికేతరుడైన బాల్క సుమన్ పాలనలో అణిచివేతకు గురవుతున్నారు అని గమనించి, ఆరోగ్యకరమైన శరీరం కన్న ఆరోగ్యకరమైన సమాజం తయారు చేయాలనే లక్ష్యంతో, నియంతల వ్యవహరిస్తున్న బాల్క సుమన్ ను ఈ ప్రాంతం నుండి తరిమికొట్టాలనే ఉద్దేశం తో వైద్య వృత్తిని వదిలి కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది అని తెలిపారు. అధికారం, సంపాదన, హోదా నాకు ముఖ్యం కాదు అని, చెన్నూరు నియోజకవర్గంలో జరుగుతున్న అరాచక, బానిస, అణిచివేత దోరణిల నుండి ఈ ప్రజలను రక్షించడమే కర్తవ్యంగా భావించి రాజకీయాల్లోకి రావడం జరిగిందన్నారు. ఆనాడు ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన మనకు నేడు స్థానికేతరుల అరాచకత్వం కు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం వచ్చిందని, ఈ పోరాటంలో మీ అందరితో నేనుంటాను అని అందరం కలిసి కట్టుగా బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిద్ధం కావాలని పిలపునిచ్చారు. చెన్నూరు గడ్డ పై కాంగ్రెస్ జెండా రెపరెపలాడించి రాష్ట్రం లో, దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే విధంగా కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే రాష్ట్రం లో ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరే విధంగా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు బాధ్యత తీసుకుంటారు అని హామీ ఇచ్చారు. ప్రజల హక్కులు హరిస్తు రాష్ట్రం లో నియంత హిట్లర్ పాలన సాగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని, చెన్నూరు నుండి బాల్క సుమన్ ను తరిమికొట్టి కాంగ్రెస్ పార్టీ గెలుపు జెండా ఎగురవేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సోమయ్య, పొన్నం లలిత, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు హరీష్ పొన్నం, శ్రావణ్, రవి, సుధీర్, సురేందర్, కృష్ణ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు….