*24న బహిరంగ సభను జయప్రదం చేయండి*

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొమ్ము.భరత్…
నాగర్ కర్నూల్ రూరల్, ఆగష్టు21(జనంసాక్షి):
నాగర్ కర్నూల్ లో ఈనెల 24,25 తేదీలలో సిపిఐ నాయకులు జిల్లా రెండవ మహాసభలు నాగర్ కర్నూల్ పట్టణంలో జరుగుతున్నాయని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొమ్ము భరత్ తెలిపారు.24న పట్టణంలోని గాంధీ వనం నుండి ర్యాలీ నిర్వహించి అనంతరం జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్ లో బహిరంగ సభ నిర్వహించ తలపెట్టినట్లు ఈ సభకు ప్రజలు అధిక సంఖ్యలో  పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఆదివారం నాగర్ కర్నూల్ మండలం పరిధిలోని వెంకటాపూర్,పుల్జాల,మల్కాపూర్,గొల్లపల్లి గ్రామలలో ఆయన పార్టీ కార్యకర్తలు,ప్రజలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,పార్టీ స్థితిగతులు భవిష్యత్తు పోరాటాల కార్యచరణ ప్రజాసంఘాల నిర్వర్తించే బాధ్యతలు వాటి పరిష్ట నిర్మాణానికి.ఈ మహాసభలు దోహదపడతాయని అన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ ప్రజలపై బారాలు మోపుతున్నారని విమర్శించారు.పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తూ ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేస్తున్నాయని అన్నారు.ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు పరచడంలో అటు కేంద్రం ఇటు రాష్ట్రం గోరంగా విఫలం చందాయన్నారు.ప్రభుత్వాలు పోటీపడుతూ,ధరలు పెంచుతూ ప్రజల బతకలేని పరిస్థితి కల్పించాలని ఆవేదన వ్యక్తం చేశారు పాలన పెరుగుతున్న ధరలు అవినీతి నిరుద్యోగం పెరుగుదల దళితులు,మహిళలపై దాడులు వగైరా వాటిపై మహాసభల్లో చర్చించి తీర్మానాలు చేసి పోరాట కార్యక్రమం రూపొందిస్తామని తెలియజేశారు.ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే చాడ.వెంకటరెడ్డి,సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే పల్లా.వెంకటరెడ్డి,సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాలనరసింహ పాల్గొంటారని కావున పార్టీ కార్యకర్తలు శ్రేణులు అన్ని వర్గాల ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి మర్యాద.వెంకటయ్య నాయకులు శంకరయ్య,నరసింహ,నాగేంద్రం,వెంకటయ్య,కాసిం,తిరుపతయ్య,భీముడు,పరుశరాముడు,లక్ష్మమ్మ,ఈశ్వరమ్మ,దేవమ్మ తదితరులు పాల్గొన్నారు.