24న బిసిల రాజ్యాధికారంపై చర్చావేదిక
ఖమ్మం, జూలై 19 : బిసి సామాజిక వర్గాలకు రాజ్యాధికారం అనే అంశంపై ఈ నెల 24న ఖమ్మంలో చర్చావేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ బిసి సంక్షేమ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు, పదోన్నతులు, తదితర అంశాలు ఎజెండాగా ఉంటాయన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోను, జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఒంటిగంటకు కార్యక్రమంరారంభమవుతుందన్నారు.