24 గంటల్లో నమోదైనవర్షపాతం

హైదరాబాద్‌: తెలంగాణలోని పలు ప్రాంతాలు భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. గత ఇరవై నాలుగు గంటలుగా పలు చోట్ల వర్సాలు కురుస్తూనే ఉన్నాయి.వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షాపాతాన్ని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌,మెదక్‌, నిజామాబాద్‌, ఖమ్మంలలో 3సెంటీమీటర్లు,మహబూబ్‌నగర్‌, భద్రాచలం, అశ్వారావుపేట, వరంగల్‌, అదిలాబాద్‌లలో 2 సెంటీమీటర్లు, హన్మకొండ, తాండూరులలో 1సెంటీమీటర్‌, వర్షపాతం నమోదైనట్టు తెలియజేశారు..