24 గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా వానలు
విశాఖపట్నం : వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం పెర్కోంది. ఉత్తరకోస్తా తెలంగాణలపై అల్పపీడనం స్థిరంగా కదులుతోందని, ఇది విదర్భవైపు పయనించి క్రమంగా బలహినపడనుందని తుపాను హెచ్చరికల కేంద్రం పెర్కోంది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వానలు కురిసేఅవకాశం ఉందని, ఒకట్రెండు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవోచ్చని పెర్కోంది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కి మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని సముద్రంలోకి వేటకువేళ్లే మత్స్య కారులు అప్రమత్తంగా ఉండాలని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది.