24 పాఠశాలల గుర్తింపు రద్దుకు సిఫార్సు
సంగారెడ్డి,ఫిబ్రవరి20( జనంసాక్షి) : జిల్లాలో 24 ప్రైవేటు పాఠశాలల గుర్తింపు రద్దు కానుంది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ రంగం సిద్దం చేసింది. ఈ పాఠశాలల్లో చేరేముందు విద్యార్థులు ఆలోచన చేయాల్సిన ఆగత్యం ఏర్పడింది. వీటి గుర్తింపు రద్దు చేయాలని పాఠశాల విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్‌కు సిఫార్సు చేసినట్లు జిల్లా విద్యాధికారి ఎ.రాజేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఫార్మేటివ్ టెస్ట్ ఫలితాల అంతర్జాల అప్‌లోడ్ కోసం ఈనెల 10, 19 తేదీల్లో నిర్వహించిన శిక్షణకు ఈ పాఠశాలల నుంచి ప్రతినిధులు రాలేదన్నారు. చేగుంటలోని సాహితీ విద్యాలయం, గజ్వేల్‌లోని సెయింట్ జోసెఫ్, విశ్వభారతి; సిద్దిపేటలోని విద్యానికేతన్, వివేకానంద, శ్రీవిజ్ఞాన్ భారతి, భారతీయ విద్యాలయం, నిఖిలేశ్వరానంద, సాయి గ్రామర్, కృష్ణవేణి టాలెంట్, శ్రీవిద్య అవాసా విద్యాలయం, గౌతం మాడల్, ఎస్‌ఆర్, కాకతీయాస్, శ్రీ చితన్య టెక్నో, శారద; హత్నూరలోని విజ్ఞాన్ కాన్సె/-టప్, కోహీర్‌లోని జీఎంఆర్, నర్సాపూర్‌లోని చితన్యభారతి, పటాన్‌చెరులోని సాయి(బీరంగూడ), రెయిన్‌బో(బీరంగూడ), ఆర్జిన్ టెక్నో, సదాశివపేటలోని శాంతినికేతన్, సంగారెడ్డిలోని శ్రీచితన్య (పోతిరెడ్డిపల్లి) పాఠశాలలు ఈ జాబితాలో ఉన్నాయన్నారు. వీటిలో చేరబోయే ముందు తల్లిదండ్రులు