25/6/22 photo 28న గోవాలో ప్రమాణ స్వీకారం చేయనున్న 320ఎఫ్ జిల్లా గవర్నర్ కన్న పరశురాములు- పూర్తి స్థాయి క్యాబినేట్ సభ్యులను నియమాకం చేసిన కన్నా
28న గోవాలో ప్రమాణ స్వీకారం చేయనున్న 320ఎఫ్ జిల్లా గవర్నర్ కన్న పరశురాములు-
పూర్తి స్థాయి క్యాబినేట్ సభ్యులను నియమాకం చేసిన కన్నా
జనగామ (జనం సాక్షి) జూన్ 25: లయన్స్ ఇంటర్నేషనల్ 320ఎఫ్ జిల్లా గవర్నర్ గా జనగామ ఆబాద్ క్లబ్ చార్టర్ అధ్యక్షుడు కన్న పరశురాములు ఈ నెల 28 న గోవాలో జరుగనున్న ప్రత్యేక సమావేశంలో పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. జూన్ 28 సాయంత్రం 7 గం. లకు కెనడాలోని మాంట్రియల్ నగరంలో జరుగనున్న 104 వ అంతర్జాతీయ మహాసభలో అంతర్జాతీయ అద్యక్షుడు బ్రియాన్ శీహాన్ 210 దేశాలకు చెందిన 778 మంది జిల్లా గవర్నర్ల చేత ప్రమాణం చేయిస్తారు. ప్రత్యక్షంగా మాంట్రియల్ నగరంలో పాల్గొనలేక పోయినవారు అదేసమయానికి జూమ్ వేదికగా ప్రపంచ వ్యాప్తంగా అందరూ పాల్గొంటారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన జిల్లా గవర్నర్ లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కన్నా దంపతులతో పాటు అవిభక్త వరంగల్ జిల్లా నుండి 33 మంది లయన్స్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సోషల్ మీడియా మాధ్యమాలలో ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించిన ఈ కార్యక్రమ ఏర్పాట్లను మల్టిపుల్ లీడర్షిప్ కోఆర్డినేటర్ ప్రస్తుత 320సి జిల్లా గవర్నర్ ఆవుల గోపాల రావు, గవర్నర్ల టీమ్ పక్షాన 320బి జిల్లా గవర్నర్ ఎలెక్ట్ కమల్ కిషోర్ అగర్వాల్ పర్యవేక్షిస్తున్నారు. పూర్తి స్థాయి క్యాబినేట్ నియామకం చేసిన కన్నా ఆగస్టు 21 న జనగామలోని బ్రమరాంభ కన్వెన్షన్ హాల్లో ప్రమాణ స్వీకారం చేయనున్న తన క్యాబినేట్ సభ్యులను జిల్లా గవర్నర్ కన్న పరశురాములు నియమించారు. క్యాబినేట్ కార్యదర్శి గా నాగబండి రవీందర్, కోశాధికారిగా అల్లాడి ప్రభాకరరావు, జిల్లా అడ్మినిస్ట్రేటర్ గా చంద్రగిరి ప్రసాద్, జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ గా కుర్రెంల యాదగిరి, జిల్లా అదనపు కోశాధికారిగా పబ్బ చంద్రశేఖర్, మెంబర్షిప్ విభాగం కోఆర్డినేటర్ గా వి. ప్రసాదరావు, లీడర్షిప్ కోఆర్డినేటర్ గా డా. అజీతకుమార్, సర్వీస్ విభాగం చైర్మన్ గా డా. తాళ్ళ రవి, విస్తరణ విభాగం ఛైర్మన్ గా ఎన్. సుధాకర్ రెడ్డి, జిల్లా చీఫ్ ఎడిటర్ గా చిర్ర ఉపేందర్ రెడ్డి తో పాటు జిల్లా సెక్రటేరియట్ టీమ్, మైక్రో క్యాబినేట్, జిల్లా కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, సంయుక్త కోషాధికారులు, రీజియన్ చైర్మన్ లు, జోన్ ఛైర్మన్ లు, ఇంకా సలహా మండలి, ఫౌండర్స్ ఫోరం తదితర విభాగాల్లో 9 మంది చొప్పున బాధ్యులను ఆలాగే వివిధ విభాగాలకు చెందిన మరో 150 మంది చైర్ పర్సన్ లని నియమించినట్లు జిల్లా గవర్నర్ కన్న పరశురాములు తెలిపారు