28న దిశకమిటీ సమావేశం

నిజామాబాద్‌,డిసెంబర్‌24(జనం సాక్షి ): ఈ నెల 28న జిల్లా అభివృద్ధి సమన్వయ మానిటరింగ్‌ కమిటీ దిశా సమావేశం జరుగనుంది. పార్లమెంట్‌ సభ్యుడు అర్వింద్‌ అధ్యక్షతన కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌లో నిర్వహించనున్నట్లు డీఆర్‌డీవో చందర్‌నాయక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 28న ఉదయం 10.30 గంటలకు కేంద్రం వివిధ శాఖలకు కేటాయించిన పనులు, వాటి వినియోగంపై సవిూక్ష నిర్వహించ నున్నామన్నారు. అధికారులు, కమిటీ సభ్యులు సకాలంలో హాజరు కావాలన్నారు.