28 నుంచి 30 వరకు దళిత మోర్చా మహా దీక్ష

నిజామాబాద్‌, జూలై 27 : దళితులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 28 నుంచి 30 వరకు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న మహా దీక్షను విజయవంతం చేయాలని జిల్లా దళిత మోర్చా అధ్యక్షుడు లింగం పిలుపునిచ్చారు. శుక్రవారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు 21వేల కోట్ల రూపాయలు వారికే కేటాయించాలని కోరారు. ప్రభుత్వం దళితులపై చిన్న చూపు చూస్తోందని ఈ విధానాన్ని మానుకోవాలని ఆయన కోరారు.