29న అరుణాచల గిరి ప్రదర్శనకు బస్సు ఏర్పాటు.

టిఎస్ఆర్టిసి డిఎం దేవరాజు.
నాగర్ కర్నూల్ బ్యూరో, జనంసాక్షి:
శ్రావణ మాస పౌర్ణమి రోజున అరుణాచల గిరి ప్రదర్శన చేసుకునే భక్తుల సౌకర్యార్థం ఈనెల 29న ప్రత్యేకంగా సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సేవలను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని నాగర్ కర్నూల్ టి ఎస్ ఆర్ టి సి డి ఎం దేవరాజు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు.29న రాత్రి 9 గంటలకు బస్టాండ్ నుండి బస్సు బయలు దేరుతుంద ని మార్గమధ్యంలో కాణిపాకం విగ్నేశ్వర ఆలయం మరియు గోల్డెన్ టెంపుల్ దర్శనం అనంతరం 30న అరుణాచలం చేరుకుంటుందని గిరి ప్రదర్శన అనంతరం 31న సాయంత్రం నాలుగు గంటలకు అక్కడి నుండి బస్సు బయలుదేరి బస్టాండ్ కు వస్తుందని వివరించారు.ఇందుకుగాను పెద్దలకు 3210 పిల్లలకు 2,110 చార్జిని నిర్ణయించడం జరిగిందని ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాలని ఆయన కోరారు.