29 నుంచి జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన – డీఈవో గోవిందరాజులు

జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో ఈనెల 29 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు జిల్లా స్థాయి జవహర్ లాల్ నెహ్రు జాతీయ సైన్స్, గణిత ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని డీఈవో డిఇఓ గోవిందరాజులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శనలు పాల్గొనాలని కోరారు.
సమాచారం, కమ్యూనికేషన్ టెక్నాలజీ పురోగతి, పర్యావరణహిత పదార్థాలు, ఆరోగ్యం, పరిశుభ్రత, రవాణా, నవీన ఆవిష్కరణలో చారిత్రక అభివృద్ధి, గణితం తదితర అంశాలలో ప్రదర్శనలు ఇవ్వాలని ఆయన సూచించారు. జూనియర్ విభాగంలో 6 నుంచి 8వ తరగతి వరకు, సీనియర్ విభాగంలో తొమ్మిది, పది తరగతుల విద్యార్థులు పాల్గొనాలని తెలిపారు. జిల్లా స్థాయిలో విజేతలను రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ కు ఎంపిక చేస్తామని, ఇతర వివరాలకు జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డిని 9989921105 ను సంప్రదించాలన్నారు.
మంగళవారం ఈనెల 22వ తేదీ మధ్యాహ్నం 2గంటల కు వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహణ మరియు అవగాహన కొరకు మండల విద్యాధికారులు, జిల్లాలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మోడల్ స్కూల్లో ప్రిన్సిపల్, కేజీబీవీల ప్రత్యేక అధికారులకు సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
సమావేశానికి సకాలంలో హాజరుకావాలని కోరారు.

తాజావార్తలు