3 వ రోజుకు చేరిన కాంగ్రేస్ పాద యాత్ర
మహాదేవపూర్. ఆగస్ట్11 (జనంసాక్షి)
మాహాదేవపూర్ మండలంలోని ఎడపల్లి గ్రామం నుండి 3 వ రోజు పాద యాత్ర ప్రారంభిస్తు .75వ స్వాతంత్ర్య ఉత్సవాల సందర్భంగా ఏఐసీసీ పిలుపు మేరకు ఏఐసీసీ కార్యదర్శి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ఆదేశాల మేరకు
మహాదేవపూర్ మండలంలో ఆజాద్ కా గౌరవ్ కాంగ్రెస్ పాదయాత్ర సాగించారు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు చేసిన పనులను భారతదేశ నిర్మాణంలో కాంగ్రెస్ పాత్రను త్యాగాన్ని నేటి తరానికి గుర్తు చేయడానికి కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర లో వివరించారు .మండలంలో ని ఎడపల్లి,కుదురుపల్లి, కన్నెపల్లి, కాళేశ్వరం వరకు 3వ రోజు పాదయాత్ర చేశారు, కాంగ్రెస్ నాయకులు, ప్రతి గ్రామములో జాతీయ జెండాలను ఎగిరిస్తూ గ్రామాలలో కాంగ్రెస్ చేసిన త్యాగాన్ని,పనులను గ్రామలలో ప్రజలకు వివరిస్తూ పాదయాత్ర కొనసాగించారు,ఈకార్యక్రమంలో మహాదేవపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు అక్బర్ ఖాన్ ,జడ్పీటీసీ గూడల అరుణ-శ్రీనివాస్ ,ఎంపీటీసీ సభ్యులు ఆకుతోట సుధాకర్. మంచినీళ్ల దుర్గయ్య ,ఎస్ సి సెల్ మండల అధ్యక్షులు లేతకరి రాజబాబు,మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు అశ్రర్,ఎస్ టి సెల్ మండల అధ్యక్షులు మరియు మోతె
సాంబయ్య,తదితరులు పాల్గొన్నారు
