30నుంచి పార్లమెంట్‌ వద్ద సీపీఎం ఆందోళన

గుంటూరు: కేంద్ర ఆర్థిక విధానాలకు నిరసనగా ఈ నెల 30నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు పార్లమెంట్‌ వద్ద ఆందోళన నిర్వహించనున్నట్లు సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి తెలియజేశారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన ఆహార భద్రత హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని చెప్పారు. గోదాముల్లోని ఆహారనిల్వలను వర్షాభావ రాష్ట్రాలకు వెంటనే కేటాయించాలని డిమాండ్‌ చేశారు.  కార్పొరేట్‌ రంగానికి, ధనవంతులకు పన్ను మినహాయింపులు రద్దుచేస్తే ఆర్ధికలోటు ఉండదని  ఆయన అన్నారు. చమురు కంపెనీలు లాభాలు ఆర్జిస్తుంటే పెట్రోలు,డీజీలు ధరల భారం మోపటం అనాలోచితమని ఆయన అన్నారు. కార్పొరేట్‌ రంగానికి, ధనవంతులకు పన్ను మినహాయింపులు రద్దుచేస్తే ఆర్థికలోటు ఉండదని ఆయన చెప్పారు.