30 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు: జేసీ

హైదరాబాద్‌ : శాసనసభలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి గత 30 ఏళ్లలో ఎప్పుడూ లేదని కాంగ్రెస్‌ నేత జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం చొరవ తీసుకుని సభ సజావుగా జరిగేలా సహకరించాలని కోరారు. అవసరమైతే తెరాస ఎమ్మెల్యేలను బయటకు పంపైనా సభను నిర్వహించాలని ఆయన సూచించారు.