326 పరుగులకు భారత్‌ డిక్లేర్‌

నాగ్‌పూర్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్‌ను భారత్‌ 9 వికెట్ల నష్టానికి 326 పరుగులకు డిక్లేర్‌ చేసింది. 8 వికెట్ల నష్టానికి 297 పరుగులతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీం ఇండియా మరో 29 పరుగులను జోడించింది. కొహ్లీ 103, ధోనీ 99, గంభీర్‌ 37, అశ్విన్‌ 29, పుజారా 26, జడేజా 12 పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో అండర్‌సన్‌ 4, స్వాన్‌ 3, పనేసర్‌ ఒక వికెట్‌ తీశారు, తొలి  ఇన్నింగ్స్‌లో 4 పరుగుల అధిక్యాన్ని ఇంగ్లండ్‌ సాధించింది.

తాజావార్తలు