33 వార్డులో పిచ్చి మొక్కలను క్లీన్ చేయిస్తున్న టిఆర్ఎస్ నాయకులు ఉంగ్లం తిరుమల్

 

 

 

 

 

 

వనపర్తి టౌన్ : డిసెంబర్ 12 ( జనం సాక్షి ) వనపర్తి పట్టణంలో 33 వార్డ్ వల్లబ్ నగర్ లో శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ఈనెల 16 నుండి “ధనుర్మాస”పూజా కార్యక్రమాలు జరుగనున్నాయి. వెంకటేశ్వర ఆలయం వెళ్లే రోడ్లలో చుట్టుపక్కల పిచ్చి మొక్కలు, మరియు డ్రైనేజీ దుర్వాసన ఉండడంవల్ల, తెల్లవారుజామున వచ్చే ,మహిళలుకు, భక్తులకు సౌకర్యంగా ఉండేందుకు, 33 వ వార్డు టిఆర్ఎస్ నాయకులు ఉంగ్లమ్ తిరుమల్ కృషితో మున్సిపాలిటీ సిబ్బందితో మాట్లాడి జెసిబి సాయంతో రోడ్డు చుట్టుపక్కల ఉన్న డ్రైనేజీ,మరియు పిచ్చి మొక్కలను సాబ్ ( క్లీన్ ) చేయించారు. కాలనీవాసులు తిరుమల్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.