34 మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు విజయవంతం

34 మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు విజయవంతం

జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని పలు గ్రామాలనుండి లయన్స్ క్లబ్ విజన్ కేర్ వ్యవస్థాపక అధ్యక్షులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శాశ్వత సభ్యులు అఫ్తాల్మిక్ అధికారి లయన్ పూదరి దత్తాగౌడ్ ఆధ్వర్యంలో 34 మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు శనివారం రోజున విజయవంతంగా లయన్స్ రేకుర్తి కంటి ఆసుపత్రి కరీంనగర్ లో నిర్వహించారు.వీరికి ఉచిత రవాణా భోజన వసతులు కల్పించారు. ఉచిత కంటి శస్త్ర చికిత్సలకు సహకరిస్తున్న రేకుర్తి కంటి ఆసుపత్రి వైస్ ఛైర్మన్ లయన్ చిదుర సురేష్ కు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్ బుద్దార్తి సతీష్ కుమార్, లయన్ అబ్దుల్ వాసే, ప్రో.జయశంకర్ ఫౌండేషన్ అధ్యక్షులు మారుతి, విజన్ ఐ కేర్ సెంటర్ నిర్వాహకులు శంషీర్ పాల్గొన్నారు.

తాజావార్తలు