371 పరుగులకు ఆసీస్ ఆలౌట్
అడిలైడ్ : భారత్‌తో వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 371 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ విజయలక్ష్యం 372 పరుగులు. ఈ మ్యాచ్‌లో సెంచరీలతో వార్నర్, మాక్స్‌వెల్ చెలరేగిపోయారు. వార్నర్ 104 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక 57 బంతుల్లో 127 పరుగులు చేసి రిటైర్డ్ ఔట్‌గా మాక్స్‌వెల్ వెనుదిరిగాడు. 11 ఫోర్లు, 8 సిక్స్‌లను మాక్స్‌వెల్ కొట్టాడు.