4వ ప్రపంచ తెలుగు మహాసభలపైప్రజలలో అవగాహన
మెదక్, డిసెంబర్ 12 : 4వ ప్రపంచ తెలుగు మహాసభలు-2012పై ప్రజలలో అవగాహన పరచుటకు జిల్లాలోని 10శాసన సభ నియోజకవర్గాల పరిధిలో జిల్లాలోని సాంస్కృతి, సంప్రదాయాలు తెలియజేసే విధంగా స్వాగత తోరణాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎ.దినకర్‌బాబు తెలిపారు. 4వ ప్రపంచ తెలుగు మహా సభలు-2012 జిల్లాలో 10 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో స్వాగత తోరణాలు అత్యంత వైభవంగా ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. పటాన్ చెరు నియోజక పరిధిలో గల బి.హెచ్.ఇ.ఎల్. చౌరస్తాలో ప్రపంచ తెలుగు మహాసభలు-2012 పొనగంటి తెలగనార్యుడు స్వాగత ద్వారంగా, సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలో గల పోతురెడ్డి పల్లి చౌరస్తాలో ప్రపంచ తెలుగు మహాసభలు-2012 మంజీర స్వాగత ద్వారంగా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలో జహీరాబాద్ ఐ.బి. వద్ద కేతకి సంగమేశ్వర స్వాగత ద్వారంగా, నారాయణఖేఖ్ నియోజకవర్గ పరిధిలలో గల నిజాంపేటలో చౌరస్తాలో ప్రపంచ తెలుగు మహాసభలు-2012 బసవేశ్‌వరుని స్వాగత ద్వారంగా, ఆందోల్ నియోజకవర్గ పరిధిలో గల ఆందోల్ బస్టాండ్ వద్ద ప్రపంచ తెలుగు మహాసభలు -2012 సింగూరు స్వాగత ద్వారంగా, మెదక్ నియోజకవర్గ పరిధిలో గల బస్టాండ్ వద్ద ప్రపంచతెలుగు మహాసభలు-2012 ఇందిర ప్రియదర్శిని స్వాగత ద్వారంగా, దుబ్బాక నియోజకవర్గ పరిధిలో గల హబ్సీపూర్ చౌరస్తాలో మెతుకుసీమ చేనేత స్వాగత ద్వారంగా, సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో గల మండల పరిషత్తు అభివృద్ధి అధికారి కార్యాలయం వద్ద బతుకమ్మ స్వాగత ద్వారంగా, గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో గల ప్రజ్ఞాపూర్ చౌరస్తా వద్ద నాచగిరి నిర్సంహ స్వాగత ద్వారంగా, నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలో గల ఐ.బి. దగ్గర ప్రపంచతెలుగు మహాసభలు-2012 అభయాంజనేయ స్వాగత ద్వార తోరణాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ వివరించారు.