4వ రోజుకు చేరిన భూమన నిరహారదీక్ష
తిరుపతి, జూన్ 27 : తిరుపతి పట్టణంలో మద్యాన్ని నిషేధించాలని కోరుతూ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి చేపట్టిన నిరాహారదీక్ష బుధవారం నాటికి నాల్గో రోజుకు చేరింది. ఆయన దీక్షకు జిల్లా నలుమూలల నుంచి రాష్ట్రం నుంచి వచ్చిన నాయకులు, అభిమానులు ఆయనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలో ఒకరోజు బంద్ నిర్వహించారు. కళాశాలలు, పాఠశాలల, వ్యాపార సంస్థలు స్వచ్చందంగా మూతపడ్డాయి. కొన్ని వర్గాలకు చెందిన వ్యక్తులు ప్రదర్శనలు నిర్వహించారు. తెరిచిన దుకాణాలను మూసివేశారు. అనేక స్వచ్ఛంద సంస్థలు, వామపక్షా నేతలు పట్టణంలో పూర్తిగా మద్యం నిషేధించాలని ఇందుకు వైఎస్సార్ సీపీ నాయకులు తమ పూర్తి మద్దతు, సహకారం ఉంటుందని అన్నారు. అంతే కాక తిరుమలకు వెళ్లే ప్రధాన రహదారుల్లో మద్యపానాన్ని నిషేధిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిందని దీనితో భక్తుల మనోభావాలు దెబ్బతిన కుండా తిరుమల పవిత్రతను కాపాడేందుకు దోహదపడుతుందని టీటీడీ బోర్డు సమావేశంలో సభ్యులు పేర్కొన్నారు.