4వ విడత పట్టణ ప్రగతిని విజయవంతం చేయండి -మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్

ఖానాపూర్ జూన్ 03(జనం సాక్షి): పట్టణం లోని పలు వార్డులలో సంబంధిత కౌన్సిలర్ల తో కలసి 4వ విడత పట్టణ ప్రగతి పై ప్రజలకు మున్సిపల్ చైర్మన్ శుక్రవారం అవగాహన కల్పించారు. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలనీలలో పారిశుద్ధ్య మరియు ఎటువంటి సమస్యలు ఉన్నా సంబంధిత వార్డు కౌన్సిలర్ లకు తెలియజేయాలని పారిశుద్ధ్య విషయంలో ఖానాపూర్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం మన ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. అలాగే ప్రజలు కూడా ఎటువంటి చెత్తాచెదారం రోడ్లపైన మురికి కాలువలో వేయకుండా పురపాలక సంఘం వారు అందించినటువంటి తడి చెత్త ,పొడి చెత్త డబ్బాలలో చెత్తను వేసి ఉంచి  పురపాలక సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి చెత్త బండిలలో చెత్తను వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో  వైస్ చైర్మన్ అబ్దుల్ ఖలీల్ , కమిషనర్ సంతోష్, కౌన్సిలర్లు, నాయకులు  కావలి సంతోష్ , కూర్మ శ్రీను,నాయిని స్రవంతి సంతోష్ , పరిమి లతా సురేష్ , పౌజియ షబ్బీర్ పాషా , కో ఆప్షన్ సభ్యులు బండారి కిషోర్,రాజేందర్,  మేనేజర్ అయుమ్ , పలు వార్డుల స్పెషల్ ఆఫీసర్స్, వార్డు కమిటీల సభ్యులు, మెప్మా, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, కాలనీ వాసులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.