4 లక్షలు దాటిన టిఆర్‌ఎస్ సభ్యత్వం
ఖమ్మం,ఫిబ్రవరి20 ( జనంసాక్షి)
: జిల్లాలో తెరాస సభ్యత్వం ఇప్పటికే 4 లక్షలు దాటిందని కొండబాల కోటేశ్వరరావు అన్నారు. సభ్యత్వ నమోదుకు మంయి స్పందన ఉందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. బంగారు తెలంగాణ లక్ష్యం సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. తెరాసలో చేరిన తమను విమర్శించే నైతిక అర్హత టిడిపి వారికి లేదన్నారు.. 33 ఏళ్లుగా జిల్లాలో తెదేపాను ఎవరు విస్తరించారో… ఎవరు ద్రోహం చేశారో తేల్చుకునేందుకు బహిరంగ చర్చకు తాము సిద్ధమన్నారు. పార్టీలో చేరతామంటూనే కొందరు తెదేపా నాయకులకు తమ పార్టీని విమర్శించే అర్హత లేదని కొండబాల కోటేశ్వరరావు ధ్వజమెత్తారుతెలంగాణ రాష్ట్రంలో తెదేపాకు భవిష్యత్ లేనందునే తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వంలో తామంతా తెరాసలో చేరామన్నారు. తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన సీపీఎంను వదిలేసిన సండ్ర తెదేపాలో చేరారని.. అలాంటి వారంతా గతాన్ని వదిలేసి నీతులు వ్లలెవేస్తున్నారని విమర్శించారు. తాము జిల్లా అభివృద్దిని కోరుకుంటున్నామని అన్నారు. తమకు జిల్లాకు నిధులు తీసుకుని వచ్చి అభివృద్ది చేసుకోవడం ముఖ్యమని అన్నారు.