40 టన్నుల అదనపు యూరియా మంజూరు
వరంగల్: యూరియా కొరత రైతులకు కన్నీళ్లు పెట్టిస్తోందని ఈటివీ ప్రసారం చేసిన కథనానికి అధికారులు స్పందించారు. ఖానాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా కొరతపై ఈటీవీ కథనానికి స్పందించి జేడీఏ నాగేశ్వరరావు 40 టన్నుల అదనపు యూరియా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఖానాపురంలో అర్థరాత్రి 12 గంటల నుంచి 9 గ్రామాల రైతులు సహకార సంఘం ఎదుట క్యూకట్టారు. మహిళలు చంటిపిల్లలతో సహా గంటలతరబడి క్యూల్లో నిలబడ్డారు. ఈ అంశంపై ఈటీవీ కథనం ప్రసారం చేసింది.