400 ఏళ్లనాటి భారీ వేపచెట్టు నేల మట్టం
చింతకాని: ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలోని శ్రీ కోదండరామాలయం ఆవరణలో గల 400 ఏళ్లనాటి భారీ వేపచెట్టు ఈ రోజు ఆకస్మికంగా కూలాపోయింది. వృక్షం నేల కూలడంతో దేవలయంలోని ధ్వజస్తంభం, ఆనాటి కల్యాణ మండపం కూడా నేల మట్టమయ్యాయి. ఈ చెట్టు దాదాపు నాలుగు వందల ఏళ్లుగా ఉందని అర్చకులు గోపాలాచార్యులు తెలిపారు. భారీవృక్షంగా పేరొందిన ఈ చెట్టు ఉన్నట్టుండి కుప్పకూలడంతో నాగులవంచతో పాటు సమీప గ్రామలాల ప్రజలు తండోపతండాలుగా వెళ్లి పడి పోయిన వేపచెట్టును చూస్తున్నారు.