400 సీట్లు పగటి కలలు

తడిగొంతు ఆరిపోవడం ఖాయం
నీళ్ళు దగ్గర పెట్టుకొండి : ప్రశాంత్‌ కిషోర్‌
న్యూడీల్లీ, మే 23 (జనంసాక్షి) :
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ దాదాపు 300 సీట్లు సాధిస్తుందని జోస్యం చెప్పారు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌. భారతీయ జనతా పార్టీకి 2019లో వచ్చినట్లుగానే ఈసారి కూడా మెరుగైన స్థానాలు కైవసం చేసుకుంటుందని.. గతంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పలు రాజకీయ పార్టీల నాయకులకు ఒక సూచన చేశారు ప్రశాంత్‌ కిషోర్‌. జూన్‌ 4 ఓట్ల లెక్కింపు రోజు న హైడ్రేటెడ్‌గా ఉండండి అని సూచించారు. అలాగే బీజేపీ రాదని భ్రమలో ఉన్న వాళ్లు గొంతు తడుపుకో వడానికి నీటిని పుష్కలంగా అందుబాటులో ఉంచుకోండి అని సందేశాన్ని తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.
ఇటీవలి ఇంటర్వ్యూలో తన అంచనాలు తారుమారు అయ్యాయని జర్నలిస్ట్‌ గుర్తు చేసిన సందర్బంగా వాడి వేడిగా మాటలు సాగాయి. అలా జరిగిన కొద్దిసేపటికే ప్రశాంత్‌ కిషోర్‌ ఈ ట్వీట్‌ చేయడం రాజకీయంగా ఆసక్తిగామారింది. 47 ఏళ్ల వయసుగల్గిన రాజకీయ వ్యూహకర్త 2022లో హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ రాబోయే ఎన్నికల పరాజయంతో సహా గతంలో తన రెండు పోల్‌ అంచనాలు తారుమారు అయ్యాయని ఆ ఇంటర్వ్యూలో గుర్తు చేశారు సీనియర్‌ జర్నలిస్ట్‌. దానికి కౌంటర్‌ గా ప్రశాంత్‌ కిషోర్‌ 2021లో బెంగాల్‌ ఎన్నికల్లో కిషోర్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ కు వ్యూహకర్తగా పనిచేశారు. మమతా బెనర్జీ టీఎంసీ పార్టీ 294 స్థానాలకు గాను 215 స్థానాలను గెలుచుకుని అఖండ మెజారిటీతో అధికారాన్ని నిలుపుకుందని ఈ సందర్భం గా మరోసారి గుర్తుచేశారు. అలాగే
ఇప్పడు తాను చెప్పే ప్రిడిక్షన్‌ కూడా నిజమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
అందుకే ప్రతి ఒక్కరూ నీటిని అందుబాటులో ఉంచుకోండి అని రాజకీయ నాయకులకు చురకలు అంటించారు. జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు విడుదల అవ్వగానే మనసు, శరీరం రెండిరటినీ హైడ్రేటెడ్‌గా ఉంచడంలో నీరు దోహదపడుతుంది అని గుర్తు చేశారు. బుధవారం ఓ ఇంటర్వూలో ప్రశాంత్‌ కిషోర్‌ మాట్లాడుతూ బీజేపీకి సొంతంగా 370 సీట్లు రావడం అసాధ్యమని, ఆ పార్టీకి దాదాపు 300 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. ఎన్డీఏ 400 మార్కును అధిగమిస్తుందని బీజేపీ ప్రకటించిన రోజునే.. ఇది సాధ్యం కాదని తాను చెప్పినట్లు వివరించారు. అయితే ఆ పార్టీ 270 మార్కుకు దిగువన పడిపోదని తాను నమ్ముతున్నానన్నారు.