42వ డివిజన్లో తిరంగా జెండార్యాలీ
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 13(జనం సాక్షి)
స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుని దేశభక్తిని చాటుకోవాలని 42 వడివిజన్ కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్అన్నారు.
తేశనివారం 42వ డివిజన్లో కార్పొరేటర్ ఆధ్వర్యంలో స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల ర్యాలీనినిర్వహించినారు.
ఈ సందర్భంగా గుండు చందన పూర్ణచందర్ మాట్లాడుతూ స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రతి ఒక్కరు ఘనంగా నిర్వహించు కోవాలని కోరారు.
ఈ ర్యాలీ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రిన్సిపాల్ విలాసాగరం రామనాథం, స్థానిక పెద్దలు ముత్తినేని రామమూర్తి, దామెరకొండ కరుణాకర్, జక్కం దామోదర్, దేవునూరి వెంకటేశ్వర్లు, ఆడెపు రఘు, మున్సిపల్ జవాన్లు ఖలీల్, రమేష్ గార్లతోపాటు మెప్మాకు చెందిన ఆర్పిలు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశావర్కర్లు, శానిటరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.