46వ రోజు టీఆర్‌ఎస్ పల్లెబాట
హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా టీఆర్‌ఎస్ చేపట్టిన పల్లెబాట 46వ రోజుకు చేరుకుంది. పల్లెలన్నీ ఉద్యమక్షేత్రాలు అయ్యాయి. వీధులన్ని జై తెలంగాణ నినాదాలతో మార్మోగుతున్నాయి. గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. పల్లెబాటలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు భారగా పాల్గొంటున్నారు. టీఆర్‌ఎస్ నేతలు తెలంగాణ ప్రజల సమస్యలను అడిగి తెలసుకుంటున్నారు. తెలంగాణ అవశ్యకతను ప్రజలకు వివరిస్తున్నారు. సీమాంథ్ర పెట్టుబడిదారులు తెలంగాణకు అడ్డుపడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసీ వస్తుందని తెలంగాణవాదులు హెచ్చరిస్తున్నారు. 28లోపు తెలంగాణ ప్రకటించకపోతే కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తామని తేల్చిచెబుతున్నారు.