రానున్న 48 గంటల్లో తెలంగాణలో వానలు

హైదరాబాద్: రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు చోట్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం వలన రాగల 48 గంటల్లో తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో వానలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.