490 కోట్ల జాక్ పాట్

zkscyzbwబ్రిటన్ యూరోమిలియన్స్ లాటరీలో అదృష్ట దేవత జాక్పాట్ రూపంలో వీరి తలుపుతట్టింది. ఇంగ్లండ్ లోని లింకన్ షైర్ కు చెందిన వీరిపై ఏకంగా రూ.490 కోట్లతో కాసుల వర్షం కురిపించింది. రిచర్డ్ మాక్స్ వెల్ అనే ఈ లక్కువీరుడు పౌల్ట్రీ ఇండస్ట్రీకి కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు. మంగళవారం వెబ్ సైట్లో లాటరీ ఫలితాలు చూసి మొదట వీరు నమ్మలేకపోయారు. ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారేమోనని అనుమానించారు. వీరిద్దరి కూతుళ్ల పరిస్థితీ అంతే! అన్నిరకాలుగా చెక్చేసుకున్న తర్వాతే ఎట్టకేలకు తమకే జాక్ పాట్ తగిలిందని నమ్మగలిగారు. ఒక్కసారిగా ఇంత డబ్బు వచ్చిపడేసరికి ఏం చేయాలో తెలియడం లేదని ఉబ్బితబ్బిబ్బు అవుతున్న రిచర్డ్.. మొదట కుటుంబంతో కలసి న్యూజిలాండ్ టూర్ కు వెళ్లి, ఆ తర్వాత తీరిగ్గా ఆలోచించాలని అనుకుంటున్నారు. అన్నట్టూ.. బ్రిటన్ లో యూరోమిలియన్స్ లాటరీ చరిత్రలోనే అత్యధిక మొత్తం జాక్పాట్ తగిలిన పదో వ్యక్తి రిచర్డే కావడం విశేషం.