5న అవార్డుల ప్రదానోత్సవం

కడప, ఆగస్టు 3 :కడప సిపి బ్రౌన్‌ గ్రంథాలయంలో ఈ నెల 5వ తేదీన ప్రసిద్ధ కథా రచయిత రావిశాస్త్రి అవార్డు ప్రదానోత్సవం జరగనున్నదని ప్రముఖ రచయితలు రాచపాలెం చంద్రశేఖర రెడ్డి చెప్పారు. ఈ ప్రదానోత్సవ సభలో ప్రముఖ కథా రచయిత కన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డికి ఈ అవార్డును అందజేయనున్నట్టు తెలిపారు. కాశీపట్నం రామారావు చేతుల మీదుగా ఈ అవార్డు ప్రదానోత్సవం జరుగు తుందని చెప్పారు.