5వ షెడ్యూల్డ్ ప్రాంతం ఆదివాసీలదే.- జనరల్ జీవో లకు చోటు లేదని హైకోర్టు స్పష్టికరణ.

5వ షెడ్యూల్డ్ ప్రాంతం ఆదివాసీలదే.- జనరల్ జీవో లకు చోటు లేదని హైకోర్టు స్పష్టికరణ

ఏటూరునాగారం(జనంసాక్షి), సెప్టెంబర్ 23:-తెలంగాణ రాష్ట్ర 5వ షెడ్యూల్డ్ ప్రాంతంలో ఏజెన్సీకి విరుద్దంగా జనరల్ జీవోలు వ్యర్తించవని హైకోర్టు తీర్పు నిచ్చింది. 17,370 చదరపు కిలోమీటర్ పరిధి వున్న ఏజెన్సీ ప్రాంతంలో జరల్ జీవో 5,9 లు అమలు కావు అని ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్ హైకోర్టు ను ఆశ్రయించడంతో తీర్పు వెలువడింది. 5వ షెడ్యూల్డ్ ప్రాంతంలో వున్న లోకల్ షెడ్యూల్డ్ ట్రైబల్ ఉపాధ్యాయుల హక్కులు అమలు చేయాలని అడ్వకేట్ మామిడి సాయి యాదవ్ ద్వారా రిట్ పి.26397/2023 కోర్ట్ నం 31 లో వాదనలు జరిగాయి. ఏజెన్సీలో ట్రైబల్ ఉపాధ్యాయ హక్కులు అమలు చేయాలని, 5వ షెడ్యూల్డ్ పారా5(1)అమలులో ఉందని తీర్పునిచ్చింది. ఏజెన్సీలో సంపూర్ణ హక్కులు అడివాసిలకే చెందుతాయని మరోసారి హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన జనరల్ జీవోలు షెడ్యూల్డ్ ప్రాంతానికి వర్తించవని ప్రభుత్వానికి సూచించింది.