‘5 ఏళ్లలో కాంతనపల్లి పూర్తి చేయండి’
హైదరాబాద్, జనంసాక్షి: కాంతనపల్లి ప్రాజెక్ట్‌ను ఐదేళ్లలో పూర్తి చేయాలని టీఆర్‌ఎస్ నేత వినోద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మంగళవారం హైదరాబాద్‌లో డిమాండ్ చేశారు. 5 ఏళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్‌కు దివంగత ముఖ్యమత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారని గుర్త చేశారు. అయినా ఇప్పటి వరకు చిన్న పని కూడా ప్రారంభంకాలేదని ఆయన ఆరోపించారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి రెండు సార్లు టెండర్లు పిలిచిన అవి పూర్తిగా లోపభూయిష్టంగా ఉన్నాయని అన్నారు.