5.ఫ్లోరైడ్ భూతాన్ని తరిమి.. ప్రజల గుండెల్ని గెలిచి..
` నల్లగొండ జనం గుండెల నిండా కేసీఆర్..
` ఆరవైఏళ్లుగా విషం నీళ్లుతాపిన సీమాంధ్ర పాలకుల దుర్మార్గం
` 60ఏండ్ల ఫ్లోరైడ్ గోసను ఏడేండ్లలో ఖతం చేసిన విజేత కేసీఆర్
` నల్గొండను నాశనం చేసింది ఎవరు?.. ఒకతరాన్ని మింగేసిన ఫ్లోరైడ్ భూతం
` పక్కనే కృష్ణానది పారుతున్నా గుక్కెడు నీళ్లు తాగడానికి కూడా వీలులేని దుస్థితి
` జిల్లాలో 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ఫలితం శూన్యం
` మునుగోడు,దేవరకొండ ప్రాంతాల్లో మానవ విధ్వంసానికి కాంగ్రెస్ కారణం
` ఏడేండ్లలో ఫ్లోరైడ్ భూతాన్ని పారదొలిన మిషన్ భగీరథ పథకం
(జనంసాక్షి ప్రత్యేక ప్రతినిధి జక్కుల రవీందర్)
హైదరాబాద్(జనంసాక్షి): నల్గోండ జిల్లా ను నాశనం చేసింది పూర్తిగా కాంగ్రెస్ అని జిల్లా ప్రజలు విశ్వసిస్తారు.రాష్ట్రాన్ని ఎక్కు కాలం పరుపాలించింది కాంగ్రెస్. నల్గోండ జిల్లాలో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఎదిగిన నేతలు కొందరు ఆంధ్రోనికి గులాములైతే మరికొందరు డిల్లీ గులాములుగా వ్యవహరించి నల్గోం డ జిల్లా ప్రజలను ఫ్లోరైడ్ బారిన పడేసి ఓ తరాన్నే నాశనం చేసారు.1956లో తెలంగాణను ఆంధ్రలో కలిపింది కాంగ్రెసే 1969లో తెలంగాణ అడిగితే 400 మందిని కాల్చిచంపింది కాంగ్రెసే…ఈ ఉమ్మడి నల్గోం డ జిల్లాకు చెందిన నేతలు జానరెడ్డి ఉత్తం కుమార్ రెడ్డి కోమట్‌రెడ్డి బ్రదర్స్ ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో తిరుగు లేని నేతలుగా చెలామని అయ్యారు.జిల్లాను పట్టిపీడిస్తు న్నా ఫ్లోరైడ్ బాధను తప్పించడానికి ఏ ఒక్కరు ప్రయ త్నం చేయక పోగా కొద్దొ గోప్పో ప్రయత్నాలు టిడిపి నుంచి గెలుపొందిన ఎల్మినేటి మాదవ రెడ్డి చేసిన ప్రయత్నాలు తాత్కాలికమ య్యాయి.విబిన్న రాజకీ యాలకు కేంధ్ర బింధువు అయిన నల్గోండ జిల్లా ప్రజ లు న్యాయం చేస్తారని ఫ్లోరైడ్ ని అంతం చేస్తామని 1994 నుంచి 98 వరకు కమ్యునిస్ట్‌లకు ఓటు వేసా రు.1990 నుంచి వరుసగా 20 ఏళ్లు కొమట్‌రెడ్డి ఉత్తం కుమార్ రెడ్డి జానారెడ్డిలకు పట్టం కట్టారు.అంటే ఇకడ సుధీర్ఘ కాలం పదవుల్లో ఉన్నది కాంగ్రెస్ నేతలే కా బట్టి ఇక్కడి ఫ్లోరైడ్ భాధితుల ఉసురు కూడ కాంగ్రె స్ నేతలకే దగ్గుకుతుంది.పక్కనే పారుతున్న కృష్ణ నధి నాగార్జునసాగర్‌లో అమృతం లాంటి నీరు ఉంటుం ది.జిల్లా ప్రజల ధాహార్తి తీర్చడం కోసం ఏ ఒక్క నాయ కుడు పనిచేయలేదు అనేది సుస్పష్టం.గాలి వాటం రాజకీయాలకు కేంధ్ర బిందువులైన కాంగ్రెస్ నాయకు లు కాంట్రాక్టర్లకు కమీషన్‌లకు అమ్ముడు పోయి బ్రతికారనే విమర్శలు ఉన్నాయి.అందుకే జిల్లాలో ఫ్లోరైడ్ బారిన పడి లక్ష50వేల మంది చనిపోయినట్లు రికార్డులు చెపుతున్నాయి.నల్గోండ జిల్లాలోని మరిగుడ మండలం బట్లపల్లి,ప్రపంచంలోని అత్యదికంగా 28 బిపిఎం ఫ్లోరైడ్ ఉన్నటు ్ల 1945లలోనే గుర్తించారు. వీటితోపాటు చెర్లగుడ ఇబ్రహింపట్నం పసునూరు తంగెడుపల్లి మునుగోడు ఫ్లోరైడ్ ప్రాంతాల తీవ్రత ఎక్కువ ఉన్నదని గుర్తించారు.ఫ్లోరైడ్ నివారణకు అప్పట ప్రభుత్వాలు చర్యలు తీసుకున్న కంటితుడు పుగానే మిగిలిపోయాయి.కాంగ్రెస్ పాలనలో ఈ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఒక్కరు కూడ ఫ్లోరైడ్ నివారణ కోసం చిత్తశుద్దితో ప్రయత్నం చేయలేదు అనేది సుస్పష్టం.ఫ్లోరైడ్ బాదితులను చూసి ఓ బ్యాంకు ఉధ్యోగి చెలించి బాధితుడిని డిల్లీ తీసుకెల్లి అప్పటి ప్రధాని వాజిపేట్ ముందున్న టేబుల్ పైన పడుకోబెట్టి వేడుకున్న నల్గోండ ప్రజలకు న్యాయం జరగలేదు.2003లో రాష్ట్ర ఆవిర్బావం కోసం తెలంగాణ ఉద్యమంలో కేసిఆర్ నల్గోండ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సందర్బం ,ఈ ప్రాంతంలో ఉన్న ఫ్లోరైడ్ బాదితులను చూసి కంటినీరు పెట్టుకున్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే నల్గోండ జిల్లాను ఫోరైడ్ రహిత జిల్లాగా చేస్తానని హామి ఇచ్చారు.ఇచ్చిన మాట ప్రకారం 5 సంవత్సరాల్లో మిషన్ భగీరథ తో నల్గోండ ఉమ్మడి జిల్లా ప్రజల గుండెల మీద ఉన్న ఫ్లోరైడ్ బండను ఎగిరేసి తన్ని ఇంటింటికి మిషన్ భగీరథ జలాలను అందించారు.ప్రస్తుతం జిల్లాలో 2లక్షల కుటుంబాలకు సురక్షిత నీరు అందిస్తున్నారు.మిషన్ భగీరథ పైలాన్‌ను మునుగోడు నియొజకవర్గంలోని చౌటుప్పల్‌లో ఏర్పాటు చేశారు.నల్గోండ జిల్లా ప్రజలు 70 సంవత్సరాలుగా ఫ్లోరైడ్ దుక్కాన్ని అనుభవించింది.కడుపులో ఉన్న పసికందును కూడ వదిలిపెట్టని ఫ్లోరైడ్ బూతం తల్లి పాలును కూడ కలుషితం చేసింది.పంట పొలాల్లో పొంగిపొర్లిన ఫ్లోరైడ్ వల్ల అనేక మంది రైతులు ఆత్మహత్యపాలయ్యారు.కట్టెచర్చిన కాలుచేతులు ,వంకర్లు తిరిగిన అవయవాలు వందలాది పసిప్రాణాలు ఎక్సిబిషన్‌లో వస్తువులుగా మారారు.20ఏళ్లకే చేతికర్ర ఊతంతో నడిచే దురావస్ద నుంచి నల్గోండ నేడు సుద్దజలాలతో కొల్కుంటుంది.
అభివృద్దిపథంలో నల్గోండ జిల్లా….
జిల్లాల పునర్‌వ్యవస్దీకరణలో బాగంగా 31 మండలాలతో జిల్లాను ఏర్పాటు చేశారు.ఈ జిల్లాలో కృష్ణ నధి మూసి డిరడి ఆలేరు పాలేరు లాంటి నధులు ప్రవహిస్తాయి.జిల్లాకు ప్రధాన ఆకర్శనంగా ఉన్న నాగార్జునసాగర్ ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో జిల్లా ప్రజల దాహర్తిని తీర్చలేదు.నీళ్లకోసం బరిగీసి కోట్లాడిన కేసిఆర్ జిల్లాలోని వందలాది ఎకరాలకు సాగర్ నీళ్లు అందేలా చేశారు.జిల్లాలోని 12 నియొజకవర్గాలకు మిషన్ భగీరథ నీళ్లు అందుతుంది.యాధాద్రి బువనగిరి జిల్లాలో నిర్మితమైన యాధాద్రి నృసింహస్వామి దేవాలయం రాష్ట్రానికే ఒ అద్బుతం.సూర్యపేట నల్గోండ జిల్లాలకు మెడికల్ కాలేజీల ఏర్పాటు మరో విజయం.అలాగే బనగిరి జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏఐఎంసి కాలేజి ఏర్పాటు అవుతుంది.ధామచర్లలో పవర్‌ప్లాంట్ జిల్లాకే తలమానికం.ఇలా గడిచిన 8 సంవత్సరాల్లో నల్గోండ జిల్లాకు వేలకోట్ల అభివృద్దిని జడిరచారు.మానవ మనుగడకే ప్రమాధమైన ఫ్లోరైడ్ బూతాన్ని తెలంగాణాలో లేకుండా శాశ్వతంగా నిర్మూలించారు.ఇందుకు నిదర్శనం గత 8 ఏళ్లలో తెలంగాణలో ఒక్క ఫ్లోరైడ్ కేసు కూడ నమొదు కాలేదని కేంధ్ర జలశక్తి శాఖ ఇటువల ప్రకటించడం గమనార్హం.