500 మంది యువకులతో నూతన బూత్ లెవల్ కమిటీలు ఎన్నిక
– విద్వేష రాజకీయాలను చేస్తున్న బీజేపీ,తెరాస పాలనను అంతం చేయడానికి యువతలో చైతన్యం తేవడానికే యూత్ జోడో బూత్ జోడో.
– ఊరూరా బూత్ లెవల్ కార్యక్రమాలు సీతక్క నాయకత్వం వర్ధిల్లాలి అంటూ అత్యధికంగ యువకుల చేరికలు.
– దాదాపు నలుబై ఆరు ఎన్నికల బూత్ లలో 500 మంది యువకులతో నూతన బూత్ లెవల్ కమిటీలు.
– యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మురుకుట్ల నరేందర్.
మంగపేట,అక్టోబర్ 01 (జనంసాక్షి):-
మండలము లోని అన్ని గ్రామాల్లో యూత్ జోడొ బూత్ జోడొ అనే నినాదంతో ముందుకు వెళ్తూ ఊరూరా ఎమ్మెల్యే సీతక్క, జిల్లా అద్యక్షులు నల్లేల కుమారస్వామి, యువజన కాంగ్రెస్ జిల్లా అద్యక్షులు రవి చందర్ పిలుపు మేరకు బూత్ లెవల్ కార్యక్రమాలు చేపట్టామని యూత్ కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెస్సిడెంట్ సుధీర్ ఏర్పాటు చేసిన సమావేశంకి ముక్య అతిదిగ హాజరైన జిల్లా యూత్ కార్యదర్శి మద్దిపాటి శేషు,మండల యూత్ అధ్యక్షుడు మురుకుట్ల నరేందర్ అన్నారు.ఈ సందర్భగ వారు మాట్లాడుతూ… యువత దేశానికి భరోసా అని దేశ భవిష్యత్తు యువత చేతిలో వుంది అని అన్నారు.మండలములో కాంగ్రెస్ పార్టికి ఎదురు లేదు అని ప్రతి పల్లె లో యువకులు ఎంతో ఉత్సాహంతో సీతక్క నాయకత్వాన్ని బలపర్చడానికి అనుకున్న దానికంటే వంద రెట్లు ఎక్కువగా కార్యక్రమానికి హాజరై విజయవంతం చేస్తున్నారని, అంతేకాక పలు గ్రామాల్లో యువత చేరికలు కూడ జరుగుతున్నాయి అని అన్నారు.నిరంకుశ పాలన చేస్తున్నా తెరాస,బిజెపి పార్టిలని అంతం చేయడానికి ముందంజలో ఉంటాం అని నినాదాలు చేశారు. మండలంలోని అన్నీ బూత్ లలో విజయవంతంగా కమిటీలు వేయడం జరిగింది అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమాన్ని తమకి అప్పగించిన జిల్లా నాయకత్వానికి, మండల నాయకత్వానికి, హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలిపారు.మండలములో 46 బూత్ లెవల్లొ దాదాపు 500మంది యువకులతో కమిటీ వేయడం జరిగింది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కార్యదర్శి మద్దిపాటి శేషు కుమార్, యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఓదెల సుధీర్,మండల ఉపాధ్యక్షులు కురసం రమేష్, మాధురి బాలు, ప్రధాన కార్యదర్శులు బాడిశ ఆదినారాయణ,చెట్టుపల్లి ముకుందం,సీనియర్ నాయకులు,ఆయా గ్రామాల అధ్యక్షులు,గ్రామ నాయకులు, యువత తదితరులు పాల్గొన్నారు.
Attachments area