51 కళాశాలలపై చర్యలకు సిద్ధం: జయప్రకాశ్‌రావు

హైదరాబాద్‌: మేనేజిమెంట్‌ సీట్ల భర్తీలో నిబంధనలు అతిక్రమించిన 51 కళాశాలలపై చర్యలకు సిద్ధమవుతున్నామని ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు జయప్రకాశ్‌ రావు చెప్పారు. కేటగిరి బి సీట్లకు సంబంధించి జీవో 74ను అతిక్రమించిన కళాశాలల్లో తనిఖీలకు ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదికి ఆధారంగా 51 కళాశాలల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించామన్నారు. నెలన్నర క్రితం ఈ కళాశాలలకు నోటీసులివ్వడం, వారి నుంచి వచ్చిన వివరణ ఆధారంగా మరో ముగ్గురు సభ్యులు కమిటీతో వాటిని పరిశీలిస్తున్నామని జయప్రకాశ్‌ చెప్పారు. రెండు రోజుల్లో కమిటీ నివేదిక అందుతుందని అందులో అక్రమాలు నిజమని తేలితే ఆ సమాచారాన్ని ఆయా కళాశాలల అనుబంధన విశ్వవిద్యాలయాలకు పంపిస్తామన్నారు. ఆ తర్వాత చర్యలు ఆయా విశ్వవిద్యాలయాలు తీసుకుంటాయని జయప్రకాశ్‌రావు చెప్పారు.