53వేల కోట్ల డబ్బు డిపాజిట్

sbiప్రధాని మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్య ప్రజానీకం పడరాని పాట్లు పడుతున్నారు. అయితే, బ్యాంకులకు మాత్రం ఇదో శుభపరిణామమనే చెప్పాలి. ఎప్పుడూ లేనంతగా రికార్డ్ స్థాయిలో ప్రజలు మనీ డిపాజిట్ చేస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీ స్థాయిలో డిపాజిట్ చేశారని ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య తెలిపారు. కొత్త నోట్లు జారీ చేస్తున్న దగ్గర్నుంచి ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ బ్రాంచీలన్నింటిలో కలిపి 53వేల కోట్ల డబ్బు డిపాజిట్ చేశారని ఆమె తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంల్లో సగం మాత్రమే కొత్త నోట్లను అందిస్తున్నాయని తెలిసింది.