55 ఏళ్ల తర్వాత జరిమానాతో సహా తిరిగొచ్చిన పుస్తకం

న్యూయార్క్‌ : ఆ పుస్తకాన్ని గ్రంధాలయంనుంచి తీసుకెళ్లినవారెవరో కానీ వారి వారసులకు మాత్రం పుస్తకాల విలువ బాగా తెలిసినట్లే ఉంది. అందుకే 55 ఏళ్ల క్రితం తీసుకెళ్లిన ఒక పుస్తకాన్ని జరిమానా డబ్బుకు సరిపోను చెక్కుతో సహా కలిపి గ్రంధాలయానికి పార్శిల్‌ చేశారు. 16వ శతాబ్దానికి చెందిన ఒక మతప్రంచారకుడి జీవిత కథ ‘ఫైర్‌ ఆఫ్‌ ఫ్రాన్సిన్‌ జేవియర్‌ ‘అన్న పుస్తకాన్ని న్యూయార్క్‌ గ్రంథాలయంనుంచి 1958 ఏప్రిల్‌ 10న ఎవరో అరువు తీసుకెళ్లారు. అది 2013లో పోస్టులో తిరిగివచ్చింది. అంత పాత రికార్డులను పరిశీలించడం సాధ్యం కాదు కాబట్టి పుస్తక తీసుకెళ్లిన వారి పేరు చెప్పలేమని గ్రంధాలయ అధికారులు పేర్కొన్నారు. పుస్తకంతో పాటు వచ్చిన చెక్కు మీద పేరును కూడా వారు బహిర్గ తపరచడం లేదు.