కభీ కభీ…

సాహిర్‌లుద్వియాని హిందీ చిత్రరంగంలో గొప్ప కవి. అతను రాసిన పాటలు అందరి మనస్సుల్లో గింగురు మంటూనే ఉంటా యి. భారత ప్రభుత్వం మార్చి 8, 2013 రోజున అతని తపాల బిల్లను విడుదల చేసింది. 8 మార్చి 1921 రోజున సంపన్న ము స్లిం కుటుంబంలో లుద్వియాని జన్మించాడు. పంజాబ్‌ రాష్ట్రంలోని లూదియానా అతని జన్మస్థలం. అతని తల్లి పేరు సర్ధార్‌ బేగం. అతని తల్లికి, తండ్రికి అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయారు. అప్పుడు సాహిర్‌ వయస్సు 13 సంవత్సరాలు. సాహిర్‌ తండ్రి రెండవ వివాహం చేసుకున్న కారణంగా సాహిర్‌ తల్లి అతని నుంచి విడిపోయింది. అతని తల్లి భర్త నుంచి ఎలాంటి ఆస్తిపాస్తులను కోరలేదు. అందుకని సాహిర్‌ చిన్నతనం కటిక పేదతనంలో గడిచింది.సాహిర్‌ పుట్టిన ఇంటిని అతని గుర్తుగా లూదియానా ప్రజ లు గుర్తించారు. దానిముందు ఓ శిలాఫలకాన్ని ఏర్పరని అతన్ని గౌరవించారు. లూదియానాలోని ఖల్సా హైస్కూల్‌లో సాహిర్‌ చదు వుకున్నాడు. అక్కడే ఉన్నత విద్యను కూడా అభ్యసించాడు. కాలేజ్‌ చదువుతున్నప్పుడే అతను గజల్స్‌ రాసేవాడు. కాలేజ్‌లోని ప్రిన్సిపల్‌ గార్డెన్‌లో ఒక అమ్మాయితో కూర్చుని పాట పాడినందుకు గాను అతన్ని కాలేజ్‌ నుంచి బహిష్కరించారు. ఆ తరువాత అతను ఢిల్లీకి వచ్చాడు. ఆ తరువాత లాహోర్‌కి వెళ్లాడు. అప్పుడే అతని మొదటి ఉర్దూ కవిత్వాన్ని రాశాడు. దాన్ని ప్రచురించడం కోసం రెండు సంవత్సరాలు వేచి చూశాడు. రెండు సంవత్సరాల తరువాత అతని కవిత్వం ప్రచురితమైంది. ఆ తరువాత అతని ప్రతిభను గుర్తించి చాలా పత్రికలు అతని కవిత్వాన్ని ప్రచురించడం ప్రారంభించాయి. ఈ మధ్యకాలంలో అతను ప్రగతిశీల రచయితల సంఘంలో చేరా డు. అతను రచనలో దేశ వ్యతిరేక భావాలున్నాయని పాకిస్థాన్‌ ప్రభుత్వం అతనికి వ్యతిరేకంగా వారంట్‌ని జారీ చేసింది. 1949 లో సాహిర్‌ లహోర్‌ నుంచి ఢిల్లీకి వచ్చేశాడు. ఢిల్లీలో కొంతకాలం వుండి బొంబాయికి వచ్చి స్థిరపడ్డాడు. బొంబాయి అతన్ని పిలిం చిందని అతని మిత్రులంటారు.అమృతపీతం అతని అభిమాని. సాహిర్‌ని ప్రేమించానని ఆమె బహిరంగంగా చెప్పింది. కాని అతను ఆమెను వివాహం చేసుకోలేదు. బ్రహ్మచారిగానే వుండిపో యాడు. బొంబాయిలోని అందేరీలో సాహిర్‌ నివసించాడు. అతని ఇంటి పక్కనే ఉర్దూ కవి గుల్జార్‌ ఉర్దూ రచయిత కిషన్‌ చందర్‌ నివసించారు. సాహిర్‌ రాసిన సినిమా పాటలు ఇప్పటికీ అందరి నోళ్లలో నానుతూనే ఉంటాయి. ఎంతో మంది సంగీత దర్శకులతో సాహిర్‌ పనిచేశాడు. అందులో ముఖ్యమైన వాళ్లు రవి, ఎస్‌డీ భర్మన్‌, రోషన్‌, కయూమ్‌, అతను రాసిన పాటలు ఎవరూ మర్చి పోలేరు.గురుదత్‌ సినిమా ప్యాసా సాహిర్‌ చిన్నతనంని దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా. ఇందు లో ప్రధాన పాత్రని గురుదత్‌ వేశాడు. అది అత్యద్భుతమైన విజ యాన్ని సాధించింది. ఆ తరువాత సాహిర్‌లో అహంకారం వచ్చేసిం ది. తాను రాసిన పాటలకే బాణీలు సృష్టించాలని సంగీత దర్శకుల మీద ఒత్తిడి తెచ్చేవాడు. లతా మంగేష్కర్‌ కన్నా ఒక రుపాయి ఎక్కువ ఇవ్వాలని కూడా బలవంతపెట్టేవాడు. కొంతకాలం తర్వాత యాష్‌చోప్రా సినిమాలకే సాహిర్‌ పరిమితమయ్యాడు. అతను రాసిన పాటలు తక్కువగా వున్నా అవి ఎక్కువ సాహిత్య విలువలను కలిగి వుండేవి. కభీ కభీ సినిమాలో రాసిన పాటలు ఒక మెరుపు మెరిశాయి. కభీ కభీ పాట ల ద్వారా అతనికి రెండవ సారి ఫిలింఫేర్‌ అవార్డు వచ్చింది.
అక్టోబర్‌ 25, 980 రోజున తీవ్రమైన గుండెపోటు వచ్చి అతని స్నేహితుడైన ఆర్‌పి కపూర్‌ చేతిలో మరణించాడు. అతను రాసిన పాటలతో చివరి సినిమా లక్ష్మి. ఉర్దూ భాషను హిందీ సినిమాలో ఉర్దూ వాడిన వ్యక్తి సాహిర్‌లుద్వియాని. అతని పాటల్లోని లోతు, బలం, స్వచ్ఛత మరెవరీ పాటల్లో కనిపించవు. అతని లాంటి పాటల రచయిత మళ్లీ జన్మించడని హిందీ సినిమా ప్రపంచం అంటుంది. అందరి గురించి పట్టించుకునే వ్యక్తి తన గురించి తాను పట్టించుకోలేదు. తన సిక్కు హిందూ మిత్రులను మర్చిపోలేక పాకిస్తాన్‌లో వుండలేక భారతదేశంలో స్థిరపడ్డ కవి సాహిర్‌ లుద్వియాని.నేటి యువతరానికి సాహిర్‌లుద్వియాని పేరు తెలిసి వుండకపోవచ్చు. కాని అతను రాసిన కభీ కభీ పాట అందరికీ గుర్తుంటుంది. ఆ పాట పాడని వ్యక్తులు లేరంటే అతిశయోక్తికాదు. ఆ పాట ఇలా వుంటుంది.
‘కొన్ని ఆలోచనలు నా హృదయాన్ని చుట్టుముడతాయి
అవి నా కోసమే తయారయినట్టుగా వుంటాయి
ఈ ఆలోచనలు రాకముందు నువ్వు ఆకాశంలో వుండి వుంటావు.
ఈ భూమిపైకి నాకోసమే వచ్చి వుంటావు.
కొన్నిసార్లు ఆలోచన నా హృదయాన్ని తాకుతుంది.
ఈ శరీరం, ఈ కళ్లు, నా ధనాగారాలు.
నీ దట్టమైన వెంట్రుకలు నాకోసమే
నీ పెదవులు నీ భుజాలు నా ధనాగారాలు.
షహనాయి నాదార్లోకి వచ్చినట్టుగా,
కొన్నిసార్లు ఆలోచనలు నా హృదయాన్ని తాకుతాయి.
పెళ్లిరాత్రి ముసుగు వేసుకుని
నా కౌగిలిలో చేరడానికి నువ్వు వచ్చావు.
ఇలాగే జీవితాంతం నన్ను ప్రేమిస్తావని
కొన్ని ఆలోచనలు నా హృదయాన్ని చుట్టుముడతాయి
ప్రేమ పూర్వకంగా నీ చూపులు నావైపు ప్రసరితమవుతాయి.
నాకు తెలుసు నువ్వు అపరిచయ వ్యక్తిగా ఇట్లాగే వుంటావు.
కొన్ని ఆలోచనలు నా హృదయాన్ని చుట్టుముడతాయి.
ఈ కవిత్వాన్ని కభీ కభీ సినిమాలో పాటగా మలిచారు. ఈ పాటలో అమితాబచ్చన్‌ కన్పిస్తారు. కాని నిజానికి కనిపించే వ్యక్తి సాహిర్‌ లుద్వియాని. ఈ పాటలో బాద వుంది. వేదన వుంది, బాధను అనుభవించిన వ్యక్తి తనకు ఎవరూలేకున్నా బతకగలరు. అతని ప్రేయసి లేకుండా బతకగలడు. అతని బాధే అతన్ని బతికిస్తుందేమో. సాహిర్‌ లుద్వియానిని అతని బాధే అతనిని ఒంట రిగా బతికించింది. కభీ కభీ పాట విన్నవాళ్లు తన వెంట ఎవరు లేకున్నా బతకగలరేమో? ఆలస్యంగానై తపాలాబిల్లను విడుదల చేసినందుకు ప్రభుత్వాన్ని అభినందించక తప్పదు.
కభీ కభీ పాటను అనువదించడం దుస్సాద్యమే. అయినా అనువాదం చేశారు. అనువాదంలోని ఇబ్బందుల గురించి మరోసారి.

తాజావార్తలు