6 వేల పాయింట్ల మార్కు దాటిన నిఫ్టీ

ముంబయి : ‘ఫిస్కల్‌ క్లిఫ్‌’ గండం నుంచి అమెరికా గట్టేక్కడం ఆసియా మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపించింది. దీంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు కొత్త సంవత్సరం రెండో రోజు కూడా భారీ లాభాలను నమోదు చేస్తున్నాయి. సెన్సెక్స్‌ 163 పాయింట్లు కుపైగా లాభపడింది. నీఫ్టీ 53 పాయింట్లకుపైగా లాభపడి 6 వేల మార్కు, సూచీనిదాటింది. జనవరి 7,2011 తర్వాత నిఫ్టీ 6 వేల మార్కును దాటడం ఇదే తొలిసారి.