6, 7 తేదిల్లో ప్రేత్యేక కేటగిరీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం: విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని మూడు విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్న ఎంబీబీఎస్/బీడీఎస్ సీట్ల ప్రవేశానికి సంబందించి ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు ఆగస్టు 6, 7తేదిల్లో సర్టిఫికేట్ల పరిశీలన ఉంటుందని విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్టార్ డాక్టర్ టి.వేణుగోపాలరావు తెలిపారు. ఇందుకు సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్‌సీసీ ఆర్మీ సంతతి అభ్యర్థులు ఆగస్టు ఆరో తేదిన స్పోర్ట్సు అండ్ గేమ్స్, వికలాంగ అభ్యర్థులు ఆగస్టు 7వ తేదీన విజయవాడలోని హెల్త్ వర్సిటీ కౌన్సెలింగ్ కేంద్రంలో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు రావల్సి ఉంటుంది. అర్హులుగా పరిగణిస్తారు. వీరంతా యూనివర్సిటీ నియమించిన మెడికల్ బోర్డు ముందు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ ఏడాది ప్రభుత్వ జీవో 141 ఉత్తర్వుల ప్రకారం ఎంబీబీఎస్/బీడీఎస్ కోర్సుల్లో ఎన్‌సీసీ కేటగిరీ అభ్యర్థులకు 0.25శాతాన్ని ఒక శాతం పెంచి ప్రవేశాలు చేస్తారు. క్రీడా అభ్యర్థులకు మినహాయించి మిగిలిన కేటగిరీ వారికి ఆగస్టులో జరిగే రెండో విడత కౌన్సెలింగ్‌లో సీట్లు కేటాయిస్తారని, క్రీడా అభ్యర్థులకు శావ్ బోర్డు నుంచి ప్రధాన్యత క్రమం అందిన తర్వాతే కౌన్సెలింగ్ చేపడతామని అధికారులు పేర్కొన్నారు.