60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మహనీయురాలు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకులు
బిచ్కుంద డిసెంబర్ (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం నాడు ఒక పార్టీ నాయకుల అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా సోనియా గాంధీ చిత్రపటాన్నికి క్షీరాభిషేకం చేసి, కేక్ కట్ చేసి సోనియమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో ప్రధానిగా అవకాశం వచ్చిన త్యాగం చేసిన గొప్ప నాయకురాలు సోనియా గాంధీ అని, పేదవాడు మూడుపూటలా భోజనం చేయాలని, వందరోజుల పని తీసుకొచ్చిన తల్లి, ప్రశ్నించే తత్వం బతికి ఉండాలని సమాచార హక్కు చట్టం ఇచ్చిన గొప్ప మహోన్నత వ్యక్తి, 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మహనీయురాలు సోనియా గాంధీకి జన్మదిన పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకం క్రింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుపేదలకు 10 లక్షల ఆరోగ్య శ్రీ పథకం ప్రారంభించడం జనం మనసులో గుర్తుండిపోతుందని వారన్నారు. మండలకేంద్రంలో గల ప్రభుత్వాసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, నూకల్ రాజు, పాషా సేట్, సాయిని అశోక్ బస్వరాజు, నేహాల్, నౌషా నాయక్, జాఫర్, సల్మాన్, అనీల్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.