తెలంగాణలో 600 మంది ఫోన్లు ట్యాప్
` బాధితుల్లో రాజకీయ నాయకులు, సినీప్రముఖులు, జర్నలిస్టులు
` జాబితాలో రేవంత్, ఈటెల, అరవింద్ , రఘునందన్ రావు
` మరోమారు విచారణకు హాజరైన ప్రభాకర్ రావు
` వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి
హైదరాబాద్(జనంసాక్షి):ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్న తరుణంలో ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి(ఎస్‌ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. నాలుగో సారి సిట్ ముందు హాజరైన ఆయనను మరింత లోతుగా విచారించేందుకు సిట్ ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే 600 మంది ఫోన్ ట్యాపింగ్ బాధితుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. ఫోన్ ట్యాపింగ్‌తో వారు ఇబ్బందులకు గురైన తీరును వివరించి.. దానిపై ప్రభాకర్‌రావు ఏం చెబుతారనే విషయాన్ని నమోదు చేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సాధారణ ఎన్నికల సమయంలో నవంబర్ 15న పెద్ద ఎత్తున ట్యాపింగ్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నవంబర్ 15న 600 మంది ఫోన్లను ప్రభాకర్ రావు టీమ్ ట్యాప్ చేసినట్లు గుర్తించారు. సాధారణ ఎన్నికల సమయంలో ప్రణీత అండ్ టీమ్ పెద్ద ఎత్తున ట్యాపింగ్‌కు పాల్పడినట్లు బయటపడిరది. ఒకే రోజు 600 ఫోన్‌లను ప్రభాకర్ రావు ట్యాప్ చేశారు. మావోయిస్టుల పేరు చెప్పి ట్యాపింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. మావోయిస్టులకు సహకారం అందిస్తున్నారని మావోయిస్టుల సానుభూతిపరుల పేర్లతో ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు. రివ్యూ కమిటీకి మావోయిస్టుల పేర్ల విూద నెంబర్లను ప్రభాకర్ రావు ఇచ్చినట్లు తేలింది. సాధారణ ఎన్నికల్లో మావోయిస్టులు యాక్టివ్ అయ్యారని కమిటీకి ప్రభాకర్ రావు చెప్పినట్లు సమాచారం. మావోయిస్టుల పేరుతో అధికార, ప్రతిపక్ష, వ్యాపార రంగానికి చెందిన వారితో పాటు జర్నలిస్టుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్ ముఖ్య నాయకులతో పాటు కీలక నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్, అరవింద్ , రఘునందన్ రావు ఫోన్‌లను ట్యాప్ చేసినట్లు గుర్తించారు. అప్పటి బీఆర్‌ఎస్ అధికారపక్ష నాయకులు, ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. ట్యాపింగ్ కోసం ప్రభాకర్ రావు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. శ్రవణ్ రావు ద్వారా సమాచారం తెప్పించుకొని ప్రణీతరావుకు ప్రభాకర్ రావు ఇచ్చేవారని తేలింది. ట్యాపింగ్ ద్వారా వచ్చిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు భుజంగరావుకు ప్రణీత్ ఇచ్చారని… భుజంగరావు నేరుగా బీఆర్‌ఎస్ నేతలకు ఫోన్ చేసి స్థితిగతులను ఎప్పటికప్పుడు వివరించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రతిపక్ష నాయకుల వైపు ఎవరైనా వెళ్తుంటే వెంటనే అధికారపక్ష నేతలకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు భుజంగరావు. ప్రతిపక్ష పార్టీలకు ఆర్థిక సాయం చేస్తున్న వారిపై నిఘా పెట్టి పోలీసులతో దాడులు చేయించారు. వ్యాపారవేత్తలపై దాడుల కోసం టాస్క్ ఫోర్స్ ఓఎస్‌డీ రాధా కిషన్ రావును ప్రభాకర్ రావు ఉపయోగించుకున్నట్లు సమాచారం. డబ్బులు ఎవరైనా తీసుకువెళ్తుంటే వెంటనే ట్యాప్ చేసి మరీ అధికారులు పట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
షర్మిల ఫోన్‌ను ట్యాప్ చేసిన గత ప్రభుత్వం
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అనేక మంది ప్రజాప్రతినిధులు, ప్రముఖుల ఫోన్లు ట్యాప్‌కు గురైనట్లు ఇప్పటికే సిట్ గుర్తించింది. తాజాగా ఆ జాబితాలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (ంఖఅఅ అఠతి।ªబి జా ªూఠజీసపత్గిªజీ) కూడా ఉన్నట్లు తేలింది. జగన్ చెª`లలెలు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్లు ట్యాప్ అయినట్లు బయటపడిరది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అత్యంత గోప్యంగా షర్మిల మొబైల్స్ ట్యాప్ అయినట్లు తేలింది. షర్మిల కోసం కోడ్ భాష ఉపయోగించినట్లు సమాచారం. షర్మిల వాయిస్ రికార్డులు అయ్యాయని, ఎవరెవరితో మాట్లాడుతుంది అనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నకు (వైఎస్ జగన్) చేరినట్లు తెలుస్తోంది. షర్మిల ఎవరెవరితో మాట్లాడే వారో ప్రతీ ఒక్కరిపై నిఘా పెట్టినట్లు సమాచారం. షర్మిల దగ్గరి మనుషులను పిలిపించి ఓ సీనియర్ పోలీస్ అధికారి వార్నింగ్ ఇచ్చినట్లు గుర్తించారు. తన ఫోన్లు ట్యాప్ అవుతున్నట్లు అప్పట్లోనే షర్మిల గుర్తించారు. ఈ క్రమంలో తన ఫోన్లు ట్యాప్ విషయంలో షర్మిల వద్ద కీలక సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం వైజాగ్ ఎయిర్‌పోర్టులో ఫోన్ ట్యాపింగ్‌పై వైఎస్ షర్మిల స్పందిచనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్టేట్‌మెంట్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు రికార్డు చేశారు. అలాగే జడ్పీ చైర్‌పర్సన్ సరిత కూడా తన ఫోన్ ట్యాప్ అయ్యినట్లు తెలపడంతో ఆమె వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేశారు. తాజాగా ఏపీసీసీ చీఫ్ షర్మిల ఫోన్ ట్యాప్ అయినట్లు గుర్తించిన పోలీసులు.. ఆమెకు నోటీసులు పంపించే అవకాశం ఉంది. షర్మిలను కూడా సాక్షిగా పరిగణిస్తూ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో షర్మిల తెలంగాణలో ఉన్న సమయంలో ఆమె ఫోన్ ట్యాప్ జరగడం.. ఆమె కదలికలను అప్పటి ప్రభుత్వం ముందస్తుగానే తెలుసుకుని అరెస్ట్ చేయడం, అడ్డుకోవడం, హౌజ్ అరెస్ట్‌లు చేసిన సందర్భాలు ఉన్నాయి. అంతే కాకుండా షర్మిల ఏయే రాజకీయ నాయకుడితో మాట్లాడుతుందన్న విషయాలతో పాటు వ్యక్తిగత కాల్స్‌ను ట్యాప్ చేసి జగన్‌కు సమాచారం అందించారనే అభియోగాలు ఉన్నాయి. ఈ క్రమంలో షర్మిల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తే ఈ కేసులో మరికొన్ని కీలకమైన అంశాలు బయటపడే అవకాశం ఉంది. అయితే షర్మిలను జూబ్లీహిల్స్ పోలీసులు సాక్షిగా పెట్టి స్టేట్‌మెంట్ రికార్డు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.
వారికి శిక్షపడాల్సిందే..
` బీఆర్‌ఎస్ ఫోన్ ట్యాపింగ్‌తోనే కాంగ్రెస్ ఓటమి
` వందలాది కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ చేశారు
` కేసీఆర్, కేటీఆర్‌లు సిగ్గుతో తలదించుకోవాలి
` బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
` జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వాంగ్మూలం
హైదరాబాద్(జనంసాక్షి): ఫోన్ ట్యాపింగ్ కేసులో కెసిఆర్ సిగ్గుతో తలదించుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆనాడు అధికారంలో ఉన్న కెసిఆర్, కెటిఆర్‌లు వేలాదిమంది కాంగ్రెస్ నేతల ఫోన్లు టాప్ చేశారని అన్నారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం టీపీసీచీఫ్ విూడియాతో మాట్లాడుతూ.. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఓటమికి ఫోన్ ట్యాపింగే కారణమన్నారు. ఎలాంటి అధికార హోదా లేని వ్యక్తికి అధికారాన్ని కట్టబట్టి తమ ఫోన్‌లను టాప్ చేయించారని ఆరోపించారు. నక్సలైట్ల సానుభూతిపరుల పేరుతో తమ ఫోన్లు టాప్ జరిగాయన్నారు. ఈనాడు కేటీఆర్ తాము నీతివంతులం, నిజాయితీపరుమలని అంటున్నారని.. ఆయన సిగ్గుతో తలవంచుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ దుర్మార్గపు చర్య అని అన్నారు.బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వందలాది మంది నాయకుల ఫోన్లను చట్టానికి వ్యతిరేకంగా ట్యాప్ చేశారని మండిపడ్డారు. రాజకీయ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేయడం హేయమైన చర్య అని విమర్శించారు. ఆనాటి సీఎం, కేటీఆర్‌లు సిగ్గుతో తలవంచుకోవాలని వ్యాఖ్యలు చేశారు. ఏ రాజకీయ నేత, పార్టీ ఉండకూడదని.. తామే శాశ్వతంగా అధికారంలో ఉండాలనే దుర్బుద్ధితో ఫోన్ ట్యాపింగ్‌కు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మూమెంట్స్ అన్ని కూడా ట్రాక్ చేశారని మండిపడ్డారు. 2022 నుంచి కాంగ్రెస్ నాయకుల ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు. 650 మంది కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ జరిగిందని తెలిపారు. మ ఫోన్లను ట్యాప్ చేసి రాజకీయ లబ్ది పొందాలని చూశారని ఆరోపించారు. నిజాయితీ గల సిట్ అధికారులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారన్నారు. భవిష్యత్‌లో మరే ప్రభుత్వం కూడా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడకుండా ఉండాలంటే ఈ కేసులో నిందితులకు శిక్ష పడాల్సిందే అని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవ్వరినీ ఉపేక్షించవద్దన్నారు. విచారణను సజావుగా జరిపి ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన వారికి శిక్ష పడేలా చూడాలని ప్రభుత్వానికి వినతి చేశారు. దేశ చరిత్రలో ఇంత మంది ఫోన్లు ట్యాప్ చేయడం ఇదే ప్రథమమన్నారు. హైకోర్టు, సుప్రీం కోర్టు ఈ కేసును తీవ్రంగా పరిగణించి నిందితులను శిక్షించాలని కోరారు. ఆనాటి నేతలు వారి అవసరాల కోసం రాజకీయ నాయకులు, జడ్జిలు, విలేకర్లలతో పాటు వారి హయాంలో పని చేసిన అధికారుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వారి అవసరాలకు అనుగుణంగా ఫోన్ ట్యాపింగ్‌ను వాడుకుందని ఆరోపించారు. 2023 ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి హార్డ్ డిస్క్‌లను ప్రభాకర్ రావు ధ్వంసం చేయించారన్నారు. ప్రభాకర్ రావు, అప్పటి చీఫ్ సెక్రటరీ కలిసి హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేశారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత ప్రభుత్వం తమ ఫోన్‌లను ట్యాప్ చేసినట్లు అనుమానం రావడంతోనే సీఎస్‌కు ఫిర్యాదు చేసినట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు ఆయన హాజరయ్యారు. ఈ కేసులో సాక్షిగా ఆయన తన వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. ‘టెలిగ్రాఫ్ చట్టానికి తూట్లు పొడుస్తూ మా ఫోన్లను ట్యాప్ చేశారు. రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం హేయమైన చర్య. ఈ చర్యకు పాల్పడిన కేసీఆర్, కేటీఆర్ సిగ్గుతో తలవంచుకోవాలి. రాజకీయాల్లో భారాస నేతలే ఉండాలనే దురుద్దేశంతో మా ఫోన్లు ట్యాప్ చేశారు. గతంలో కాంగ్రెస్ ఓడిపోవడానికి ఫోన్ల ట్యాపింగే కారణమని తెలుస్తోంది. రేవంత్ రెడ్డితో పాటు నా ఫోన్ కూడా ట్యాప్ చేసి మా కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఇదే ఫిర్యాదును గతంలోనూ చేశాను. ఇవాళ వాస్తవాలు బయటకు వచ్చాయి. చట్టానికి వ్యతిరేకంగా అనేకమంది ఫోన్లను ట్యాప్ చేశారు. 2022 నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్‌లో ఉన్నాయి. సిట్ దర్యాప్తులో 650 మంది కాంగ్రెస్ నాయకుల పేర్లు జాబితాలో ఉన్నాయని తెలిసిందన్నారు. ‘కుంభం అనిల్ కుమార్ యాదవ్, గాలి అనిల్‌తోపాటు అనేకమంది ఫోన్లు ట్యాప్ అయినట్లు బయటికి వచ్చింది. ఇవన్నీ చూస్తుంటే, నాడు ఏ రకంగా అధికారాన్ని దుర్వినియోగం చేసి దుశ్చర్యకు పాల్పడ్డారో అర్థమవుతోంది. ప్రజాస్వామ్యంలో నిక్కచ్చిగా పనిచేయాల్సిన అధికారులు.. రాజకీయ నాయకులకు తలొగ్గి అడుగులకు మడుగులొత్తారు. ప్రైవసీ అనేది మా ప్రాథమిక హక్కు.. దానిని కాలరాశారు. పదవీ విరమణ చేసిన ప్రభాకర్‌రావును దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పెట్టారు. నక్సలైట్లకు సానుభూతిపరులుగా ఉన్నారని మమ్మల్ని ట్యాప్ చేయడం సిగ్గుచేటు. కేటీఆర్ సిగ్గుతో తల దించుకోవాలి‘ ‘ఆనాడు మా ఫోన్లు ట్యాప్ చేసి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నం చేశారు. దానికి విూరు శిక్షార్హులు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడకుండా ఉండాలంటే వీరికి శిక్ష పడాల్సిందే. ఇలాంటి దిగజారుడు పనికి ఒడిగట్టిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కూడా శిక్ష పడాలి. సజావుగా విచారణ జరిపి… రాజకీయ నాయకులైనా, అధికారులైనా… బాధ్యులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం‘ అని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో (ఖఠనీని। ªుజూతినిణ అజీబ।) సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో బాధితుల నుంచి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసే పక్రియను సిట్ మొదలుపెట్టింది. ఇప్పటికే కొంతమంది బాధితుల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన సిట్.. తాజాగా ఈ కేసులో సాక్షిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని నిర్ణయించి.. ఆయనకు సమాచారం అందించారు. ఇందులో భాగంగా మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు మహేష్ కుమార్ చేరుకున్నారు. దీంతో జూబ్లీహిల్స్ పీఎస్ ముందు కాంగ్రెస్ కార్యకర్తల హడావిడి నెలకొంది. సిట్ కార్యాలయానికి పెద్దఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకున్నారు. పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లేందుకు యత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని బయటకు పంపించి వేశారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. కాగా.. ప్రస్తుతం టీపీసీసీ చీఫ్‌గా వ్యవహరిస్తున్న మహేష్ కుమార్.. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆ సమయంలో తన ఫోన్‌ను ట్యాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ప్రణీత్ రావును అరెస్ట్ చేసి ఆయనకు సంబంధించి ఫోన్లను రికవరీ చేసిన సమయంలో అందులోని డేటాను విశ్లేషించగా.. మహేష్ కుమార్ గౌడ్‌కు చెందిన అంశాలు బయటపడ్డాయి. దీంతో ఆయన ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో మహేష్ కుమార్‌ను బాధితుడిగా భావించి ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని నిర్ణయించారు.
టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు
హైదరాబాద్(జనంసాక్షి):టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌కు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపణలు చేయడంతో కేటీఆర్ ఈ నోటీసులు పంపినట్లు సమాచారం.మహేశ్‌కుమార్‌గౌడ్ ఏమన్నారంటే?..‘‘టెలిగ్రాఫ్ చట్టానికి తూట్లు పొడుస్తూ మా ఫోన్లను ట్యాప్ చేశారు. రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం హేయమైన చర్య. ఈ చర్యకు పాల్పడిన కేసీఆర్, కేటీఆర్ సిగ్గుతో తలదించుకోవాలి. రాజకీయాల్లో భారాస నేతలే ఉండాలనే దురుద్దేశంతో మా ఫోన్లు ట్యాప్ చేశారు. గతంలో కాంగ్రెస్ ఓడిపోవడానికి ఫోన్ల ట్యాపింగే కారణమని తెలుస్తోంది. రేవంత్ రెడ్డితో పాటు నా ఫోన్ కూడా ట్యాప్ చేసి మా కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఇదే ఫిర్యాదును గతంలోనూ చేశాను. ఇవాళ వాస్తవాలు బయటకు వచ్చాయి. చట్టానికి వ్యతిరేకంగా అనేకమంది ఫోన్లను ట్యాప్ చేశారు. 2022 నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్‌లో ఉన్నాయి. సిట్ దర్యాప్తులో 650 మంది కాంగ్రెస్ నాయకుల పేర్లు జాబితాలో ఉన్నాయని తెలిసింది’’ అని మహేశ్ కుమార్‌గౌడ్ అన్నారు.