610 జీవో అమలుకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: 610 జీవో హైకోర్టు సమర్దించింది. ప్రభుత్వోద్యుగుల భర్తీలో 610 జీవోను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. టీచర్ల బదిలీ, నియామకాల్లో ఇప్పటి నుంచే ఈ జీవోను అమలు చేయాలని ఉత్తర్వులు పేర్కొంది. మిగిలిన విభాగాల్లో జారీ తేదీ నుంచి ఈ జీవో అమలు చేయాలని స్పష్టం చేసింది.