వాహనంపై నుంచి పడి కార్మికుడికి గాయాలు
ఖమ్మం,(జనంసాక్షి): కొత్తగూడెం ఓపెన్ కాస్ట్ గనుల్లో వాహనంపై నుంచి జారాపడి నాగయ్య అనే కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. కొత్తగూడెం పీవీకే-5 భూగర్భ గనుల్లో జరిగిన మరొక ప్రమాదంలో వాహనం టైరు పేలి ఇద్దరు కార్మికులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.